మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా విషయంలో గత కొంత కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని చేస్తున్న చిరంజీవి తదుపరి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. సుజీత్ తో పాటు ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించాయి. ఇదే సమయంలో మెహర్ రమేష్ పేరు కూడా ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ తో చుట్టరికం ఉందంటారు. ఇండస్ట్రీలో మెహర్ రమేష్ కు మంచి పరిచయాలున్నాయి.
ఆ పరిచయాల కారణంగానే దర్శకుడిగా సినిమాలు చేయకున్నా కూడా ఇతరత్ర విషయాలతో ఎప్పటికప్పుడు బిజీగానే ఉంటున్నాడు. శక్తి చిత్రం తర్వాత ఈయన దర్శకత్వంలో సినిమా అంటే హీరోలు వెనుకాడుతున్నారు. కాని మెహర్ రమేష్ మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా చిరంజీవికి ఈయన స్టోరీ లైన్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇవి పుకార్లే అనిపిస్తున్నా కూడా మెగా ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్నాయి.
మెహర్ రమేష్ తో సినిమాపై ఎవరికి నమ్మకం లేదని.. అలాంటిది చిరంజీవి ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వస్తున్న ఈ వార్తలు కాస్త కంగారు పెడుతున్నాయంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అంతటి పిచ్చి నిర్ణయం తీసుకోడని ఆశిస్తున్నాం అంటూ మరికొందరు మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి అసలు విషయం ఏంటీ అనేది ఆ మెహర్ రమేష్ కాని మెగా కాంపౌండ్ కాని క్లారిటీ ఇవ్వాలి.