ఈ మధ్య స్టార్ డైరెక్టర్ లకు, క్రేజీ హీరోలతో వర్క్ చేసిన డైరెక్టర్లకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టుకోవడం కష్టంగా మారుతోంది. సూపర్ హిట్ ఫిల్మ్ ని అందించినా మరో హీరోతో కొత్త ప్రాజెక్ట్ ని ఓకే చేయించుకోవడం కత్తిమీద సాములా మారుతోంది.
వివరాల్లోకి వెళితే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా అంటే ఎగిరి గంతేసిన డైరెక్టర్ సాగర్ కె. చంద్ర ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'భీమ్లానాయక్'.
మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు అన్నీ తానై వెనకుండి నడిపించాడు. దర్శకుడిగా సాగర్ కె.
చంద్ర కు బాధ్యతలు అప్పగించినా త్రివిక్రమ్ ప్రధాన బాధ్యతల్ని తీసుకోవడంతో ఈ మూవీ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. ఈ సినిమాతో దర్శకుడిగా క్రేజ్ ని దక్కించుకుని వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లని దక్కించుకుంటానని ఆశ పడిన సాగర్ కె. చంద్రకు 'భీమ్లానాయక్' పెద్దగా అవకాశాల్ని తెచ్చిపెట్టలేకపోయింది.
దీంతో సాగర్ కె. చంద్ర తన తదుపరి ప్రాజెక్ట్ ల కోసం హీరోలని సంప్రదించడం మొదలు పెట్టాడు. తాజాగా హీరో నితిన్ తో తన కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్ ఇటీవలే 'మాచర్ల నియోజక వర్గం'తో భారీ ఫ్లాప్ ని దక్కించుకుని తీవ్రంగా అభిమానుల్ని నిరాశ పరిచాడు. ఈ సినిమాతు తరువాత బిగ్ హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పటికే తనతో వక్కంతం వంశీతో పాటు పలువురు దర్శకులు సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా 'భీమ్లానాయక్' డైరెక్టర్ సాగర్ కె. చంద్ర కూడా చేరినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే దర్శకుడు సాగర్ కె. చంద్ర..హీరో నితిన్ కు కథ వినిపించాడట. ప్రస్తుతం చర్చల దశలో వున్న ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని, ఓ విభిన్నమైన కథతో ఈ మూవీ తెరపైకి రానుందని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.