ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సెట్స్ కి వెళ్లేది అప్పుడేనా?

Update: 2022-10-21 02:30 GMT
రీమేక్ సినిమా `వ‌కీల్ సాబ్‌`తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ త‌రువాత కూడా మ‌ళ్లీ రీమేక్ సినిమానే ఎంచుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ `భీమ్లానాయ‌క్‌` త‌రువాత గ‌త కొన్ని నెల‌లుగా షూటింగ్ ల‌కు దూరంగా వుంటున్నారు. దీంతో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ ఫిల్మ్‌ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` ఫైన‌ల్ షూటింగ్ గ‌త కొన్ని నెల‌లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

ఈ మూవీతో పాటు మ‌రో రీమేక్ ఫిల్మ్ `వినోదాయ సితం` టీమ్ కూడా సెట్స్ పైకి వెళ్ల‌డానికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ప‌వ‌న్ మ‌రోసారి దేవుడి పాత్ర‌లో న‌టించ‌నున్న ఈ మూవీని న‌టుడు స‌ముద్ర ఖ‌ని తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఇందులోని కీల‌క పాత్ర‌లో యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌నున్నండ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతోంది. ఇక ఈ మూవీతో పాటు హ‌రీష్ శంక‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్` ప్రాజెక్ట్ కూడా ప‌వ‌న్ సిగ్న‌ల్ కోసం ఎదురుచూస్తోంది.

ఇటీవ‌ల `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` త‌దుప‌రి షెడ్యూల్ కోసం నిర్వ‌హించిన వ‌ర్క్ షాప్ లో టీమ్ తో పాటు పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ త‌రువాత జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో భాగంగా ఏపీలో వారం పాటు ప‌ర్య‌టించడం, వైసీపీ నేత‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. ఏపీ నుంచి హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ సెట్స్ లోకి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ముందు గా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`ని పూర్తి చేయ‌బోతున్నాడ‌ట‌.

ఆ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ రీమేక్ ల‌ని ప‌ట్టాలెక్కించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ `వినోదాయ సితం` రీమేక్ తో పాటు `సాహో` ఫేమ్ సుజీత్ తో `తేరీ` రీమేక్ ని కూడా ప‌ట్టాలెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

అక్టోబ‌ర్ లాస్ట్ వీక్ నుంచి ప‌వ‌న్ సెట్ లోకి అడుగు పెట్ట‌నున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. నీసెంట్ గా ప‌వ‌న్ వైసీపీ నాయ‌కుల‌పై చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ గా హీట్ ని పెంచేశాయి. ఈ నేప‌థ్యంలో తాజా హీట్ త‌గ్గిన త‌రువాతే ప‌వ‌న్ షూటింగ్ ల‌ని మొద‌లు పెట్టే అవ‌కాశం వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News