`మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్‌ని ప్రకటించి షాకిచ్చిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయికి మించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని అశ్వనీదత్ బృందం వెల్లడించింది. ఇటీవల సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్ కు మెంటర్‌గా జాయినవుతారని ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ పై సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ సినిమాకి సింగీతం కనెక్టివిటీ దేనికి? అన్నది ఆరా తీస్తే.. క్లాసిక్ డైరెక్టర్ సింగీతం దర్శకత్వం లో వచ్చిన ఐకానిక్ మూవీ `ఆదిత్య 369` కనెక్షన్ స్ఫురణకు వచ్చింది. ఈ క్లాసిక్ మూవీ ఆధారంగా `ఆదిత్య 999` పేరుతో సీక్వెల్ చేయాలని సింగీతం శ్రీనివాసరావు చాలానే ట్రై చేశారు. బాలకృష్ణకు కథ వినిపించారు. ఇదే సినిమాతో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞని కూడా పరిచయం చేయాలని ప్లాన్ చేశారు. బాలయ్య 100వ చిత్రంగా తెరపైకి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలని అనుకున్నారు. కానీ వీఎఫ్ ఎక్స్ విషయంలో సింగీతంని బాలయ్య నమ్మకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని ప్రచారమైంది.
ఈ సీక్వెల్ ఐడియా నచ్చడంతో ఆ కథకు `జగదేకవీరుడు అతిలోక సుందరి` కాన్సెప్ట్ ని జోడించి కొత్త కథని సిద్ధం చేసి పాన్ ఇండియా స్థాయిని మించి సినిమా చేయాలని అల్లుడు నాగ్ అశ్విన్ తో మార్పులకు శ్రీకారం చుట్టారట అశ్వనీదత్. అదే కథని ప్రభాస్ కు నాగ్ అశ్విన్ కొత్త పంథాలో నెరేట్ చేశారని స్క్రిప్టు అద్భుతంగా వుండటంతో మరో మాట లేకుండా ప్రభాస్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ నిరాధారమైనవే అయినా నిప్పు లేనిదే పొగ రాదు కదా! అన్న వాళ్లు ఉన్నారు. మరి దీనిపై అశ్విన్ బృందం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో కాస్త ఆగి చూడాలి.