సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సందడి ఓ కొలిక్కి వస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అపోజిషన్ ఏదీ లేకపోవడంతో రన్ సాఫీగా ఉంది కానీ లేదంటే ఇంకా స్లో అయిపోయి పరిస్థితి తేడాగా ఉండేదని ట్రేడ్ రిపోర్ట్. 85 కోట్ల షేర్ దాటేసింది అని చెబుతున్నారు కాని కనీసం ఇంకో పది కోట్లు వస్తే తప్ప మహర్షి బ్రేక్ ఈవెన్ చేరుకున్నట్టు కాదు. అదంతా ఈజీ కూడా అనిపించడం లేదు.
మహేష్ కెరీర్ బెస్ట్ అని ఎంత చెప్పుకున్నా ఏ సినిమాకు చేయనంత భీభత్సమైన ప్రమోషన్ ఈ మహర్షికే చేసినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. దర్శకుడు వంశీ పైడిపల్లిని మహేష్ ఆకాశానికి ఎత్తేసి ముద్దులు పెట్టేసుకున్నాడు కాని క్రిటిక్స్ మాత్రమే కాదు సామాన్య ప్రేక్షకులు సైతం వంశీ ఓ క్లాసిక్ తీశాడన్న అభిప్రాయాన్ని అధిక శాతం వ్యక్తం చేయలేదు.
మరి తను నిర్మాత కాకపోయినా మహేష్ ఇంత ఎగ్జైట్ మెంట్ గురవ్వడానికి కారణం ఇది పాతికవ సినిమా కావడం తప్ప మరో కారణం కనిపించలేదు. వినడానికి బాగున్న మహర్షి కథ తెరమీదకు వచ్చేటప్పటికి ఫార్ములా తరహాలో ఇరికించిన కమర్షియల్ అంశాలు ఇదో సగటు సినిమా అనే ఫీలింగ్ కలిగించాయి. లేకపోతే యూనిట్ చెప్పారని కాదు కాని నిజంగానే రికార్డులు బద్దలయ్యేవి.
ఇదిలా చెప్పిన దాన్ని కన్నా చాల ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టించిన కారణంగా వంశీ పైడిపల్లి మీద నిర్మాతలు కాస్త గుర్రుగా ఉన్నప్పటికీ కేవలం అతని మీద మహేష్ కున్న సాఫ్ట్ కార్నర్ ని చూసి ఏమి అనలేకపోతున్నారట. ప్రిన్స్ హ్యాపీగా విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెరుగుతున్న డ్రాప్ పర్సెంటేజ్ ని నిలబెట్టాలంటే ఎలాంటి పబ్లిసిటీ చేయాలో అర్థం కాక తలపట్టుకుంది మహర్షి టీం. ఊరట కలిగించే అంశం ఏమిటంటే మహర్షికి ధీటుగా ఓ మోస్తరు పోటీ ఇచ్చే సినిమా మే చివరి రెండు వారాల్లో ఏదీ లేకపోవడం