రాఖీభాయ్ కి అక్క‌డ ఇబ్బందులు త‌ప్ప‌వా?

Update: 2022-01-25 05:30 GMT
ఒమిక్రాన్‌, కోవిడ్ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా పెద్ద చిత్రాల రీలీజ్ ల‌కు బిగ్‌బబ్రేక్ ప‌డింది. అయితే తాజాగా ఈ భారీ చిత్రాలు మారిన డేట్ ల‌ని ప్ర‌క‌టించ‌డంతో ఒక్కో బిగ్ ఫిల్మ్ ఒక్క మూవీతో పోటీప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. గ‌త రెండు నెల‌లుగా రిలీజ్ డేట్ ల‌ని మార్చుకుంటూ వ‌స్తున్న చిత్రాల‌తో పాటు మ‌రో మూడు నెల‌ల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి రెడీగా వున్న చిత్రాల మ‌ధ్య పోటీ అనివార్యంగా మారింది. అంతే కాకేండా రాఖీభాయ్ మూవీకి మారిన రిలీజ్ డేట్ ల కార‌ణంగా ఇబ్బందులు త‌ప్పేలా లేవు.

రాఖీభాయ్ య‌ష్ న‌టించిన హైవోట్లేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `కేజీఎఫ్ చాన్ట‌ర్ 2`. ప్ర‌శాంత్ నిల్ అత్యంత ప్ర‌తి ష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీపై ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్ప‌డింది. `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డంతో చాప్ట‌ర్ 2పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ సిరిమా ఎప్పుడెప్పుడు థియేర్ల‌లోకి వ‌స్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఏప్పిల్ 14న ఈ చిత్రాన్ని వ‌రల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.  

ముందు ఈ మూవీ సోలోగా రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించింది. మేక‌ర్స్ కూడా మా చిత్రానికి పోటీగా ఏ సినిమా రిలీజ్ కు సాహ‌పించ‌ద‌ని భావించారు. కానీ ఇదే డేట్ న తాను వస్తున్నానంటూ బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ త‌న `లాల్ సింగ్ చ‌ద్దా` చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి షాకిచ్చారు. అంతే కాకుండా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`కు తాము పోటీగా దిగ‌డం లేద‌ని, ఈ విష‌యంలో వారు మ‌మ్మ‌ల్ని క్ష‌మించాలని అమీర్‌ఖాన్ ప్ర‌క‌టించారు కూడా.

దీంతో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`. లాల్ సింగ్ చ‌ద్దా మ‌ధ్య బాక్సాఫీస్ వ‌ద్ద భారీ పోటీ త‌ప్ప‌ద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. త‌న‌కు పోటీ లేద‌ని ఫీలైన రాఖీభాయ్ లాల్ సింగ్ చ‌ద్దా ఎంట్రీతో కొంత ఇబ్బందికి గుర‌వుతున్నార‌ట‌. కార‌ణంగా `లాల్ సింగ్ చ‌ద్దా` కార‌ణంగా ఉత్త‌రాది బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని పంచుకోవాల్సిన ప‌రిస్థితి. ఇదిలా వుంటే `ఆర్ ఆర్ ఆర్` కూడా ఏప్రిల్ లోనే థియేట‌ర్ల‌కు రాబోతోంది. ఇటీవ‌ల మార్చి మిస్స‌యింతే ఏప్రిల్ లో ఖ‌చ్చితంగా వ‌స్తామ‌ని మేక‌ర్స్ స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.

ఈ రెండు చిత్రాల కార‌ణంగా చాలావ‌ర‌కు `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`కు తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ `బీస్ట్` రూపంలో మ‌రో దెబ్బ త‌గ‌ల‌బోతోంది. ఈ చిత్రం కూడా ఏప్రిల్ 14నే రిలీజ్ కాబోతోంది. ఇది కేజీఎఫ్ టీమ్ కు భారీ షాక్ గా మార‌బోతోంద‌ని తెలుస్తోంది. కార‌ణం ఏంటంటే విజ‌య్ `బీస్ట్` కార‌ణం త‌మిళనాడులో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` క‌లెక్ష‌న్ ల‌కు భారీ గండిప‌డే అవ‌కాలు క‌నిపిస్తున్నాయి. మార్చి మిస్స‌యితే ఏప్రిల్ 28న `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ కాబోతోంది. అంటే `కేజీఎఫ్ 2`కు కేవ‌లం రెండు వారాలు మాత్ర‌మే వుంటుంది. 14న విడైద‌లైతే `కేజీఎఫ్` కేవ‌లం రెండు వారాల క‌లెక్ష‌న్ ల‌తో మాత్ర‌మే స‌రిపెట్టుకోవాల్సిందే.

ఈ నేప‌థ్యంలో రిలీజ్ డేట్ ని మళ్లీ మార్చి వెన‌క్కి వెళ్లాల‌న్నా వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఇప్ప‌టికే సినిమా ఆల‌స్యం కావ‌డంతో ఏప్రిల్ 14ని మ‌రోసారి మార్చాల‌ని కేజీఎఫ్ మేక‌ర్స్ భావించ‌డం లేద‌ట‌. ఏదైతే అదైంది. ముందు అనుకున్న ఏప్రిల్ 14న రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌య్యార‌ట‌. అయితే అనుకున్న ప్ర‌కారం రాఖీభాయ్ ఈ సారి 200 కోట్ల కు మించి వసూళ్ల‌ని రాబ‌ట్ట‌డం అన్న‌ది క‌ష్ట‌మే అంటున్నారు. ఈ టెన్ష‌న్ లో ప్రొడ్యూస‌ర్ వుండ‌గా హీరో య‌ష్ మాత్రం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాడ‌ట‌. ప్ర‌శాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఇందులో `స‌లార్‌` పేరుతో ప్ర‌భాస్ తో ఓ మూవీని పూర్తిచేస్తున్న ఆయ‌న ఎన్టీఆర్ తో మ‌రో చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.
Tags:    

Similar News