`గీత గోవిందం` గీతగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయింది రష్మిక మందన. కెరీర్ ప్రారంభించిన ఐదేళ్లలోనే అసాధారణ స్టార్ డమ్ అందుకున్న యువ నాయికగా వెలిగిపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో బిగ్ కెరీర్ తో దూసుకుపోతోంది.
అయితే రష్మిక మందన కెరీర్ ప్రారంభించింది కన్నడ రంగంలో. అక్కడ తన తొలి సినిమా హీరో కం నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడడం అటుపై నిశ్చితార్థం.. అనంతరం పెళ్లి వేడుక క్యాన్సిల్ అవ్వడం వరకూ తెలిసినవే. టాలీవుడ్ లో ఛలో చిత్రంతో హిట్టందుకుని కెరీర్ పై ఫోకస్ చేసే క్రమంలో రక్షిత్ నుంచి రష్మిక విడిపోవడం ట్రోలింగ్ వగైరా తెలిసినవే. ఇక రష్మిక తన నుంచి విడిపోయాక పూర్తిగా కెరీర్ పైనే ఫోకస్ చేసిన రక్షిత్ ఇటీవల పాన్ ఇండియా సినిమాలపైనా ఫోకస్ చేసాడు. అతడు నటించిన కన్నడ చిత్రాలను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసి రష్మిక కంటే ఒక మెట్టు పైనే ఉన్నానని నిరూపించే పంతంతో ఉన్నాడు.
రక్షిత్ నటించిన తాజా చిత్రం చార్లీ 777 ని రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఎలా పుట్టించారో కానీ రక్షిత్ పెళ్లి గురించిన గాసిప్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. రక్షిత్ శెట్టి త్వరలోనే రమ్య అకా దివ్య స్పందనను తప్ప మరెవరినీ వివాహం చేసుకోను అని భీష్మిచుకుని కూచున్నాడని సోషల్ మీడియా సైట్ లలో పుకార్లు వ్యాపించాయి. ఊహాగానాలు బహుశా కొన్ని యూట్యూబ్ ఛానెల్ ల వల్ల స్ప్రెడ్ అయ్యాయని భావిస్తున్నారు.
రక్షిత్ శెట్టి- రమ్య పెళ్లిపై రూమర్స్
రక్షిత్ శెట్టి - రమ్య పై ఈ రూమర్ వచ్చాక ఆరాలు మొదలయ్యాయి. ఈ రూమర్‌పై రక్షిత్ శెట్టి స్నేహితుడు.. నటుడు-చిత్ర నిర్మాత రిషబ్ శెట్టి స్పందించారు. చార్లీ 777 ప్రెస్ మీట్ లో రక్షిత్-రమ్యల పెళ్లి పుకారు గురించి అతను చమత్కారంగా మాట్లాడారు. తన స్నేహితుడు రక్షిత్ శాండల్ వుడ్ గోల్డెన్ గర్ల్ ని పెళ్లాడడం లేదని క్లారిటీనిచ్చారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్ లు వెల్లడించినట్టుగా రక్షిత్ రమ్యను వివాహం చేసుకోవడం లేదు అని రిషబ్ మీడియా ప్రతినిధులు అతిథులకు నవ్వుతూ చెప్పారు. అయితే ఇది నిరాధారమైన రూమర్ అని కొన్ని రోజుల క్రితం రక్షిత్ శెట్టి కూడా స్పష్టం చేశాడు.
``ఇప్పటి వరకు ఆమెను కలవలేదు`` అని రక్షిత్ తెలిపారు. ``అయితే ఆమె తన క్రష్ అని ఒప్పుకున్నాడు. ఆమె అభిమానులలో చాలా మందిలాగే నేను కూడా నా కాలేజీ రోజుల్లో తనపై క్రష్ కలిగి ఉన్నాను`` అన్నారు. మీడియా నాన్ సెన్స్ సృష్టిస్తోందని ఆరోపించారు.
``ఉలిదవరు కందంటే నుండి ఆమె నా నటనను మెచ్చుకుంది.. అది చాలా స్వీట్ గా అనిపించింది`` అని శెట్టి పేర్కొన్నారు. నటుడు కం ఫిలింమేకర్ అయిన రక్షిత్ ఇంతకుముందు `ఉలిదవరు కందంటే` కోసం రమ్యను సంప్రదించాడని.., అయితే కథ అర్థంకాకపోవడంతో ఆమె తిరస్కరించిందని వెల్లడించారు. మీరు ఆమెతో కలిసి పని చేయాలనుకుంటున్నారా? అని అడిగినప్పుడు రక్షిత్ తన తదుపరి సినిమాల్లో ఆమెతో కలిసి పనిచేయడానికి ప్లాన్ చేయడం లేదని చెప్పాడు.
ఏది ఏమైనప్పటికీ రమ్య మార్కెట్ ను కమాండ్ చేస్తుందని .. బహుశా ప్రేక్షకులను తనంతట తానుగా థియేటర్ లకు లాక్కెళ్లగల నటి అని రక్షిత్ అభిప్రాయపడ్డారు. రమ్య తిరిగి సినిమాల్లోకి రావాలి అని కోరుకున్నాడు. మొత్తానికి రమ్యతో రక్షిత్ పెళ్లి వ్యవహారం గాలి వార్త అని ప్రూవ్ అయ్యింది.