మాస్ రాజా రవితేజ్ గేర్ మార్చిన సంగతి తెలిసిందే. హీరోగా సినిమాలతో పాటు...స్టార్ హీరోల చిత్రాల్లో గెస్ట్ అప్పీరియన్స్ సైతం ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'వాల్తేరు వీరయ్య'లో చిరు సవతి సోదరుడి పాత్ర పోషిస్తున్నాడు. అలాగే అవసరమైన సందర్భంలో గాయకుడిగానూ మరిపోతున్నారు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులుగా చెప్పొచ్చు.
ఇక నిర్మాతగానూ రాజా బిజీ అవుతున్నట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం 'మట్టీకుస్తి' అనే సినిమాను మరి కొంతమంది భాగస్వాము లతో కలిసి నిర్మిస్తున్నారు. అలాగే చెంగూరు బంగార్రాజు అనే మరో సినిమా కూడా నిర్మిస్తున్నారు.
ఇది రవితేజలో న్యూ కోణం అని చెప్పాలి. ఇంత వరకూ నటుడిగానే మెప్పించిన ఆయన ఇప్పుడు నిర్మాణ రంగంలోకి దిగడంతో? ఇక్కడ సంపాదించింది ఇక్కడే పెట్టుబడిగా కూడా పెట్టాలని బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇదే సమయంలో రాజా కనీసం కథ కూడా వినకుండా స్టోరీలు ఒకే చేస్తున్నట్లు తాజా సన్నివేశం ఒకటి చెబుతుంది. మట్టీ కుస్తీ త్వరలో రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో అందులో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఈసినిమాకి రవితేజకూడా ఓ నిర్మాతగా ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు సెట్స్ కి రాలేదు. కథ కూడా వినలేదు. అన్నిబాద్య తలు విష్ణు విశాల్ కి అప్పగించారు.
చివరిగా అన్ని పనులు పూర్తయిన తర్వాత సినిమా మాత్రం చూపించండని..అంత వరకూ ఎలాంటి వివరాలు కూడా అడిగి తెలుసుకోన అన్నారుట. దీన్ని బట్టి రవితేజ సినిమాపై ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్ధమవుతంది. సాధారణంగా ఎంత బిజీగా ఉన్నా ఓ చోట పెట్టుబడి పెట్టామంటే? ఎంతోకొంత బాధ్యత తీసుకుంటాం.
కనీసం అప్పుడప్పుడు అయినా క్లుప్తంగా వివరాలు అడిగి తెలుసుకుంటాం. కానీ రవితేజ ఆ రకమైన ప్రయత్నం కూడా చేసినట్లు లేదు. డిసెంబర్ 2న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో రవితేజ నేరుగా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తాడేమో. మరి అప్పుడైనా నిర్మాతగా తన ప్రయాణం గురించి వివరాలు ఏమైనా ఇస్తాడేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.