సీమ‌కు ఫ్యాక్ష‌న్ ముద్ర ప‌డిందా? బ‌ల‌వంత‌గా వేశారా?

Update: 2023-01-13 14:30 GMT
రాయ‌లసీమ అంటే రాయ‌లేలిన సీమ ర‌త‌నాలసీమ అనే చ‌రిత్ర వుంది. రాయ‌ల పాల‌న‌లో సంస్కృతి సంప్ర‌దాయాల‌కు రాయ‌ల‌సీమ నెల‌వ‌ని చ‌రిత్ర చెబుతోంది. అయితే ఆ చ‌రిత్ర‌ని మార్చి రాయ‌లసీమ అంటే ర‌క్త‌పాతం అని, క‌ర్క‌శ‌త్వానికి నిల‌య‌మ‌ని సినిమాలే చూపిస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు నెట్టింట వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో సీమ సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టింది విక్ట‌రీ వెంక‌టేష్. జ‌యంత్ సీ. ప‌రాన్జీ రూపొందించిన `ప్రేమించుకుందాం రా` సినిమా రాయ‌ల సీమ ఫ్యాక్ష‌న్ నేపథ్యంలో సాగ‌డం తెలిసిందే.

1997లో విడుద‌లైన ఈ మూవీతో టాలీవుడ్ లో సీమ ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు శ్రీకారం చుట్టారు. అయితే నంద‌మూరి బాల‌కృష్ణ.. బి.గోపాల్ లో రూపొందిన `స‌మ‌ర‌సింహారెడ్డి` సీమ అంటే ర‌క్త‌పాతం, రాళ్లు, ముఠా క‌క్ష‌లు త‌ప్ప మ‌రేమీ లేద‌నే అభిప్రాయాన్ని మ‌రింత బ‌లంగా జ‌నాల్లోకి తీసుకెళ్లింద‌ని, అక్క‌డ పాల‌కులు రాక్ష‌సుల‌ని, వాళ్ల‌కు ఎదురుగా నిల‌బ‌డే ఓ పెద్ద, అత‌ని చుట్టూ మందీ మార్భ‌లం.. అత‌న్ని న‌మ్ముకుని ప‌ద‌లు సంఖ్య‌లో వూళ్లు, వారి కోసం నాయ‌కుడిగా నిల‌బ‌డి క‌త్తిప‌ట్టి ఒంటిచేత్తో శ‌తృవుల‌కు బుద్ది చెబుతూ అడ్డు వ‌చ్చి వారిని హీరో ఊచ కోత కోస్తుంటాడ‌ని `స‌మ‌ర సింహారెడ్డి` నుంచి నిన్న విడుద‌లైన `వీర సింహారెడ్డి` వ‌ర‌కు ప్ర‌తీ ఫ్యాక్ష‌న్ సినిమా నిరూపిస్తూ వ‌స్తోంద‌ని నెటిజ‌న్ లు సెటైర్లు వేస్తున్నారు.  

ఇంత వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో రాయ‌ల‌సీమంటే ఫ్యాక్ష‌నే అని, వెనుక‌బాటు త‌న‌మ‌నీ, అక్క‌డ లా అండ్ ఆర్డ‌ర్ ఉండ‌దని అంతా ఊరి పెద్ద గొడ్డ‌లిలోనే వుంటుంద‌నే విధంగా రాతియుగం నాటి క‌థ‌లు ఇంకా రుద్దుతుండటం.. ఈ త‌ర‌హా క‌థ‌ల‌కు అభిమానులు కేక‌లు వేయ‌డం.. మ‌రీ దారుణంగా వుంద‌నే కామెంట్ లు చేస్తున్నారు.  

బాల‌కృష్ణ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వీర సింహారెడ్డి`. జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ మూవీ నిండా ర‌క్త‌పాత‌మే. ఈ మూవీలో వైయెలెన్స్ భీభ‌త్సం.. బాల‌య్య న‌రుకుడే నరుకుడు.. ట‌ర్కీలోనూ అదే సీన్ రిపీట్ చేసిన తీరుకు నెటిజ‌న్ లు..రాయ‌ల‌సీమ అంటే క‌ర్క‌శ‌త్వ‌మేనా వీరా అంటూ నెట్టింట ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ట‌.

బాల‌కృష్ణ సినిమా అంటే మోత‌దుకు మించిన హింస క‌నిపిస్తోంద‌ని, వంద మందిని కూడా అల‌వోక‌గా న‌రికి చంప‌డం వంటి ఒళ్లు గ‌గుర్పొడిచే సీన్ ల‌తో నింపేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. సినిమా టాక్ డివైడ్ గా వున్నా వ‌సూళ్ల‌ని లెక్క‌ల్ని ప‌క్క‌న పెడితే సినిమాలో బాల‌య్య చెప్పిన ఊర మాసీవ్ డైలాగ్ లు సీమ సంస్కృతిని మ‌రింత‌ మ‌స‌క‌బార్చేలా వున్నామ‌ని వాపోతున్నారు. బాల‌య్య సినిమాలంటే న‌రుకుడు చంపుడేనా?.. అంటూ సీమలో వున్న విద్యావంతులు ఆ పేరెత్త‌డానికే ఇష్ట‌ప‌డ‌టం లేద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఇటీవ‌ల పీపుల్స్‌ స్టార్ ఆర్. నారాయ‌ణ మూర్తి రాయ‌ల‌సీమ‌కు ఫ్యాక్ష‌న్ ముద్ర వేశారంటూ మండిప‌డిన తీరు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. కొంత మంది స్వార్థ‌ప‌రులు సీమ‌కు ఫ్యాక్ష‌న్ ముద్ర వేశార‌న్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రు స్వార్థ‌ప‌రులు సీమ సంస్కృతిని కించ‌ప‌రిచేలా ఫ్యాక్ష‌న్ ముద్ర వేసి చూపించ‌డం ఆవేద‌న క‌లిగిస్తోంద‌న్నారు.
Tags:    

Similar News