ఇంత‌కీ RC 15 ప్రాజెక్ట్ శంక‌ర్ సినిమానేనా?

Update: 2022-12-02 08:30 GMT
కొంత మంది సినిమా వ‌స్తోందంటే ప్రేక్ష‌కుల్లో వుండే హ‌డావిడీ హంగామా వేరుగా వుంటుంది. వారి నుంచి ఎలాంటి సినిమా వ‌స్తోందో?.. ఈ సారి మ‌రే కొత్త అంశాన్ని ట‌చ్ చేస్తున్నారో.. అది ఎలాంటి స‌ర్ ప్రైజింగ్ ఎలిమెంటో.. ఏ స్థాయిలో స‌ర్ ప్రైజ్ చేస్తుందో అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు.

ద‌క్షిణాదికి చెందిన ద‌ర్శ‌కుడు శంక‌ర్ నుంచి సినిమా వ‌స్తోంద‌న్నా అత్య‌ధిక శాతం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. 'జెంటిల్ మెన్' మూవీతో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌స్ధానాన్ని ప్రారంభించిన శంక‌ర్ త‌న ప్ర‌తీ సినిమా విష‌యంలోనూ ప్రేక్ష‌కులు క్యూరియాసిటీతో ఎదురు చూసేలా చేశారు.

జెంటిల్ మెన్ టు '2.0' శంక‌ర్ సినిమా అన‌గానే ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఉత్సుక‌త మొద‌ల‌య్యేది. దానికి కార‌ణం శంక‌ర్ త‌ను చేసే సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేంత వ‌ర‌కు ఎలాంటి క‌థ‌తో వ‌స్తున్నాడు? ..ఏం చెప్ప‌బోతున్నాడు?.. సొసైటిపై ఎలాంటి కౌంట‌ర్ కు రెడీ అవుతున్నాడు?.. ఎలా స్థాయిలో సరికొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు? అనే ఆస‌క్తి ప్ర‌తీ ప్రేక్ష‌కుడిలోనూ వుంటూ వ‌స్తోంది. అయితే '2.0' శంక‌ర్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ RC 15 విష‌యంలో మాత్రం అలాంటి హ‌డావిడీ.. అంచ‌నాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా క్రేజీ డైరెక్ట‌ర్ శంక‌ర్ RC 15 అనే వ‌ర్కింగ్ టైటిల్ లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ తండ్రిగా, త‌న‌యుడిగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ మూవీ స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో న‌డిపిస్తున్నాడ‌ని ఇప్ప‌టిరే లీకైన రామ్ చ‌ర‌ణ్‌, అంజ‌లి ఫొటోల‌తో స్ప‌ష్టం కావ‌డంతో క‌థ ఎలా వుంటుంది? .. నేప‌థ్యం ఏంటీ అనే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

రీసెంట్ గా న్యూజీలాండ్ లో ఈ మూవీ షూటింగ్ జ‌రిగింది. అక్క‌డ రామ్ చ‌ర‌ణ్‌, కియారాల‌పై ఓ పాట‌ని షూట్ చేశారు. ఇటీవ‌లే షూటింగ్ కూడా పూర్త‌యింది. టీమ్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేసింది. ఇదిలా వుంటే గ‌త కొంత కాలంగా శంక‌ర్ సినిమా అంటే ఓ రేంజ్ క్రేజ్ ఆడియ‌న్స్ లో వుంటూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కానీ ఈ మూవీకి మాత్రం ఆ స్థాయి క్రేజ్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. త‌న నుంచి సినిమా వ‌స్తోందంటే క్రేజ్ ఏ స్థాయిలో వుంటుందో అంద‌రికి తెలిసిందే.

నేష‌న‌ల్ వైడ్ గా అటెన్ష‌న్ క్రియేట్ అవుతూ వుంటుంది. కానీ శంక‌ర్ చేస్తున్న RC 15 మాత్రం ఆ స్థాయి బ‌జ్ ని క్రియేట్ చేయ‌లేక‌పోతోంద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఏదో సినిమా చేస్తున్నాం అంటే చేస్తున్నాం అనే రేంజ్ లో టీమ్ అంతా సైలెంట్ మోడ్ లో వ‌ర్క్ చేసుకుంటూ పోతోంది. నేష‌న‌ల్ వైడ్ టా అటెన్ష‌న్ ని క్రియేట్ చేయ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయిలో బ‌జ్ ని సొంతం చేసుకునే శంక‌ర్ సినిమా ఇదేనా.. ఇంత‌కీ RC 15 ప్రాజెక్ట్ శంక‌ర్ సినిమానేనా? అనే కామెంట్ లు సర్వ‌త్రా వినిపిస్తున్నాయి. దిల్ రాజు కూడా ఇంత సైలెంట్ ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News