విక్ట‌రీ వెంకటేష్ ని లైన్ లోకి తెస్తోన్న శైలేష్ కొల‌ను!

Update: 2022-12-15 16:30 GMT
'ఎఫ్ -3' త‌ర్వాత విక్ట‌రీ  వెంకటేష్ నుంచి కొత్త సినిమా ప్ర‌క‌ట‌న రాని సంగ‌తి తెలిసిందే. సినిమా విడుద‌లై నెలలు గ‌డుస్తున్నా వెంకీకి స‌రైన క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతో డిలే చేస్తున్నారు. ఈసారి సోలోగా హిట్ కంటెంట్ తోనే రావాల‌ని బ‌లంగా డిసైడ్ బ‌రిలోకి దిగాల‌ని క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. దీనిలో భాగంగా క‌థ‌లు వింటున్నా కుద‌ర‌డం లేదు. ఇప్ప‌టికే త‌రుణ్ భాస్క‌ర్..అనుదీప్. కెవి లాంటి ద‌ర్శ‌కులు వెంకీకి  స్టోరీలు చెప్పి రెడీగా ఉన్నారు.

కానీ వాటిని ఇప్పుడే ప‌ట్టాలెక్కించ‌డం క‌రెక్టేనా?  కాదా? అన్న మీమాంస‌లో వెన‌క‌డుగు వేస్తున్నారు. ఇంకా ప‌లువురు ద‌ర్శ‌కులు వెంకీ క‌థ‌లు చెప్పి క్యూలో ఉన్నారు.  రెడీ అంటే ముందుకెళ్ల‌డానికి సిద్దంగా ఉన్నారు. విక్ట‌రీ గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా 'హిట్' ప్రాంచైజీ  ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను కూడా ఓ క‌థ చెప్పాడుట‌.

క‌థ ఆద్యంతం థ్రిల్ల‌ర్ అంశాల‌తో కూడుకున్న‌దిట‌. దీంతో శైలేష్ విష‌యంలో వెంకీ పాజిటివ్ గా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే శేలేష్ 'హిట్ -2' తోనూ స‌క్స‌స్ ని ఖాతాలో వేసుకున్నాడు. హిట్ -3 కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఈనేప‌థ్యంలో ఉన్న వాళ్ల‌లో శైలేష్ అయితేనే ఉత్త‌మంగా భావించి వెంకీ ముందుగా ఇత‌ని ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

ఈచిత్రాన్ని సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్ స్వ‌యంగా  నిర్మించ‌డానికి  ముందుకొస్తున్న‌ట్లు స‌మాచారం. థ్రిల్లర్ చిత్రాల‌కు థియేట‌ర్ స‌హా ఓటీటీలోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ బిజినెస్ లెక్క‌లు అన్నింటిని ప‌క్కాగా వేసుకునే వెంకీ-సురేష్ బాబులు శైలేష్ ని తెర‌పైకి తెస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అయితే ఇక్క‌డో మెలిక ఉంది. ఇప్ప‌టికే శేల‌ష్ హిట్ -3 చిత్రాన్ని ప్ర‌క‌టించారు.

ఆ క‌థ ప‌నుల్లో నిమ‌గ్న‌మైన‌ట్లు తెలిపారు. ఇంత‌లో వెంకీ  ప్రాజెక్ట్  తెర‌పైకి రావ‌డంతో  ముందు ఏది మొద‌ల‌వుతుంది? అన్న డైల‌మా కూడా ఉంది. హిట్ ప్రాంచైజీతో  శైలేష్ తో యంగ్ హీరోలంతా  ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు.

క‌థాబ‌లంతోనే అత‌ని చిత్రాలు బాక్సాఫీస్  రాణిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో హిట్ -3 లో న‌టించ‌డానికి నేచుర‌ల్ స్టార్ నాని రెడీ అయిపోతున్న సంగ‌తి తెలిసిందే.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News