క్రేజీ హీరోయిన్ సమంత ఎక్కడా తగ్గేదిలే అంటూ అడుగులు వేస్తోంది. ఎలాంటి పాత్రలకైనా తాను సిద్దం అంటూ మేకర్స్‌కి సిగ్నల్స్ ఇస్తోంది. పెళ్లికి ముందు ఎలాంటి జోరుని చూపించిందో చైతో పెళ్లి తరువాత కూడా తన జోరుని ఏ మాత్రం తగ్గించలేదు. చెప్పాలంటే విడాకుల తరువాత అగ్రెసీవ్ గా అడుగులు వేస్తూ గ్లామర్ పాత్రలకు కూడా తాను రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి షాకిచ్చింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో సమంత చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
విడాకులకు ముందే నటించిన ఈ వెబ్ సిరీస్ ద్వారా దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది. అంతే కాకుండా ఇందులో నటిగా ఎలాంటి బారియర్స్ పెట్టుకోకుండా నటించి సంచలనం సృష్టించింది. బోల్డ్ సన్నివేశాల్లోనూ, యాక్షన్ సన్నివేశాల్లో నటించడంతో ఒక్కసారి సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో టాక్ ఆఫ్ ది ఇండియా గా మారింది. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకె సంయుక్తంగా రూపొందించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ఓటీటీ వరల్డ్ లో సంచలనం సృష్టించింది.
ఈ సిరీస్ తో సమంత బాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. దీంతో ఉత్తరాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకుని వార్తల్లో నిలిచింది. అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన సమంతకు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' నటిగా సరికొత్త ఇమేజ్ ని, ఫేమ్ ని తెచ్చిపెట్టింది. తమిళనాట ఈ సిరీస్ వివాదం కావడం కూడా సమంతకు మరింతగా ప్లస్ అయి తనని మరింత పాపులర్ అయ్యేలా చేసింది.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గుణ్ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'. ఈ మూవీ షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీ తరువాత సామ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'యశోద'లో నటిస్తోంది. ఈ మూవీ కూడా ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీని దీన్ని నిర్మించారు.
ఇక విజయ్ దేవరకొండ తో కలిసి సామ్ 'ఖుషీ' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సామ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ నిడిమోరు, కృష్ణ డీకె త్వరలో మరో వెబ్ డ్రామాని తెరపైకి తీసుకురాబోతున్నారు. హాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా నటించిన 'సిట్టాల్' అనే సిరీస్ ని భారతీయ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు.
ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించబోతోంది. యాక్షన్ ఘట్టాలకు అధిక ప్రాధాన్యం వున్న సిరీస్ కావడ్తో దీనికి సంబంధించిన శిక్షణని సామ్ ఇప్పటికే మొదలు పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన స్టంట్ మాస్టర్ నేతృత్వంలో దాదాపు మూడు నెలల పాటు శిక్షణ తీసుకోబోతోందట.