ఛలో` తర్వాత యంగ్ హీరో నాగశౌర్య కెరీర్ కి ట్రాక్ తప్పిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు సినిమాల్లో నటించాడు. కానీ ఏదీ హిట్టవ్వలేదు. ఇటీవలే సొంత ప్రొడక్షన్ లో నిర్మించిన `అశ్వథ్థామ` కూడా నిరాశపరిచింది. ఈ సినిమా కోసం తన రైటర్ గా మారాడు. రిలీజ్ కు ముందు సినిమాపై హైప్ బాగానే క్రియేట్ అయింది. కానీ అది ఎందుకూ కలిసి రాలేదు. బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ గా కూడా నిలవలేదు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో మరో సినిమా ఏదీ లేదు. ఇప్పటికే నాగశౌర్య మార్కెట్ డౌన్ అయింది. వరుస ప్లాప్ ల నేపథ్యంలో బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు.
తాజాగా మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అప్పట్లో నాగశౌర్య హీరోగా కమెడియన్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాతగా ఓ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొంత పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేసారు. అయితే షూటింగ్ ఇప్పటివరకూ నత్తనడకగా సాగింది. ఆ సినిమా చేస్తూనే నాగశౌర్య మిగతా ప్రాజెక్ట్ లకు కమిట్ అయ్యాడు. అయితే అవసరాలతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే శౌర్యపై అమెరికాలో ఓ షెడ్యూల్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. కానీ ఏడాదిగా షెడ్యూల్ వేయడం... అటుపై వాయిదా మీద వాయిదా వేయడం కొంతవరకూ ఆటంకానికి కారణమైంది.
చివరికి ఈ ప్రాజెక్ట్ లాభం లేదని ఆపేసారట. ఇది అర్థాంతరంగా ఆగిపోవడానికి మరో ప్రధాన కారణం కూడా వినిపిస్తోంది. ఎంచుకున్న కథాంశాన్ని బట్టి ఓవర్ బడ్జెట్ అవుతుందని...ప్రస్తుతం నాగశౌర్య పై అంత పెట్టడం కూడా వృథా అని భావించి లైట్ తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా? ఇప్పటికే నాగశౌర్య కెరీర్ డైలామాలో ఉంది. ఉన్న ఈ ఒక్క ఆశపై కూడా నీళ్లు చల్లేసారు. దీంతో యంగ్ హీరో మరోసారి సొంత బ్యానర్లోనే ప్లాన్ చేసుకోక తప్పదని టాక్ వినిపిస్తోంది.