ముంబై బ్యూటీ కియరా అద్వాణీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి వరుస ఫ్లాప్ ల తర్వాత కార్తిక్ ఆర్యన్ సరసన నటించిన భూల్ భూలయ్యా 2 ఘన విజయాన్ని అందించింది. ప్రస్తుతం వరుణ్ ధావన్- అనిల్ కపూర్ - నీతూ కపూర్ లతో కలిసి మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ డ్రామా 'జగ్ జగ్ జీయో' విడుదల కోసం కియరా వేచి చూస్తోంది. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం వివాహానంతర సమస్యల నేపథ్యంలోని కథతో తెరకెక్కింది. వరుణ్ సరసన కియారా తొలిసారి నాయికగా నటించింది.
కియరా ప్రస్తుతం సినిమా రిలీజ్ ముంగిట ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అదే క్రమంలో తనకు కాబోయే వాడిని వెతుకుతోందంటూ రాస్తున్న మీడియాపై కియారా చిందులు తొక్కింది. ఆ మేరకు ముంబై మీడియా కథనాలు ప్రచురించింది. ప్రముఖ హిందీ మీడియాతో మాట్లాడుతూ.. ''కియారా తన భాగస్వామిలో ఏం కావాలో వెల్లడించింది. విశ్వాసం- అవగాహన- విధేయత- గౌరవం - గొప్ప హాస్యచతురత తన భాగస్వామిలో తాను కోరుకునేవి అని తెలిపింది.
ప్రేమికుల్లో నేను చూసినవి విన్నవి అతడిలో కలిగి ఉండి నాలో ఆ అనుభూతిని కలిగించాలని కోరుకుంటున్నాను. నన్ను పెద్దగా భ్రమల్లో ఉంచకూడదని అనుకుంటున్నాను'' అని తెలిపింది.
మానవ సంబంధాలపై మాట్లాడుతూ... ఆరోగ్యకరమైన సంబంధం గురించి చక్కని సలహాను కూడా ఇచ్చింది. ఇరువురి సంబంధం బలపడడంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనదని నొక్కి చెప్పింది. ''బంధంలో ఎలాంటి ఇగోలు ఉండకూడదు. సంబంధంలో మీరు చేసే చెత్త పని ఏమిటంటే మీ అహాన్ని తెరపైకి తీసుకురావడం. నా వరకూ ఆరోగ్యకరమైన సంబంధం అనేది స్పష్టమైన గౌరవప్రదమైన సంభాషణ కలిగి ఉండడం... మీరు ఒకరినొకరు అంగీకరించాలి. అనుబంధాన్ని పెంచుకోవాలి'' అని తెలిపింది.
ఆసక్తికరంగా కియారా తన పర్సనల్ లైఫ్ విషయంలోనూ హెడ్ లైన్స్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అందాల భామ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లు కథనాలొచ్చాయి. నిజానికి ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెరపై ఒక రేంజులో అగ్గిరాజేసింది. ఇటీవల బ్రేకప్ వార్తలు వచ్చినా ఈ జంట తిరిగి పార్టీల్లో కలుసుకోవడంతో అలాంటిదేమీ లేదని కూడా క్లారిటీ వచ్చింది.
ఆరోగ్యకరమైన సంబంధం గురించి కియారా ఇచ్చిన సూచనల్ని సిద్ధార్థ్ వింటున్నాడా లేదా చూడాలి. కెరీర్ సంగతి చూస్తే.. కియారా వరుసగా కొన్ని ఆసక్తికరమైన సినిమాలలో నటిస్తోంది. జగ్జగ్ జీయోతో పాటు.. శంకర్ -రామ్ చరణ్ లతో RC-15 .. విక్కీ కౌశల్ తో గోవింద నామ్ మేరాలో కనిపించనున్నారు.