సమంత రష్మిక ప్లేస్ లో శ్రీలీల మృణాల్ ఠాకూర్ వచ్చేశారా..?

Update: 2023-01-05 00:30 GMT
తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ కథనాయికల కొరత ఉంటూనే వస్తుంది. వారానికి పదుల సంఖ్యలో రిలీజ్ అవుతున్నా వారిలో కొత్త హీరోయిన్స్ చాలా మంది ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. కానీ స్టార్ క్రేజ్ దక్కించుకున్న వారు మాత్రం చాలా తక్కువ. అందం ఉండి అభినయం రాని వారు.. కాస్త టాలెంట్ ఉన్నా లక్ కలిసి రాని వారు.. అందం, అభినయం ఉన్నా ఆసక్తి లేక మరికొందరు ఇలా పరిశ్రమలో కథానాయికల కొరత కి ఛాన్స్ ఇస్తున్నారు.

ఈ క్రమంలో స్టార్ క్రేజ్ దక్కించుకున్న అతి కొద్దిమంది హీరోయిన్స్ నే స్టార్ హీరోలంతా రిపీటెడ్ గా సినిమాలు చేస్తుంటారు. స్టార్ సినిమా అంటే చాలు కుదిరితే పూజా హెగ్దే లేకుంటే రష్మిక ఆమె కుదరకపోతే సమంత అంటూ లెక్కలేసుకుంటారు. ఈమధ్య హీరోయిన్స్ కి కూడా డిమాండ్ పెరగడంతో వారు కూడా ఎక్కడ తగ్గట్లేదు. పూజా హెగ్దే స్టార్ క్రేజ్ తెచ్చుకున్నా సరైన పాత్ర ఇస్తే ఆమె దాన్ని మోయడం కష్టమని అంటారు. రష్మిక మాత్రం అటు అందంలో ఇటు అభినయంలో అదరగొడుతుంది. కానీ ఇప్పుడు ఆమె బాలీవుడ్ మీద దృష్టి పెడుతుంది. అందుకే వారసుడు తర్వాత అమ్మడు ఒక్క సౌత్ సినిమాకు సైన్ చేయలేదు.

ఇక సమంత విషయానికి వస్తే ఆఫ్టర్ డైవర్స్ సమంత కేవలం లేడీ ఓరియెంటెడ్ కథలనే చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ టైం లో స్టార్ హీరోలంతా కూడా కొత్త హీరోయిన్స్ వైపు చూస్తున్నారు. ఇక సమంత, రష్మిక, పూజా హెగ్దేల తర్వాత ఆ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉన్న వారి లిస్ట్ చూస్తే వారిలో శ్రీ లీల, మృణాల్ ఠాకూర్ లు ఉన్నారు. కన్నడ భామ శ్రీ లీల పెళ్లిసందడితో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమాలో అమ్మడి యాక్టివ్ నెస్ కి ధమాకా ఛాన్స్ ఇచ్చారు. రవితేజ ధమాకా కూడా సెన్సేషనల్ హిట్ అవడంతో ఆమెకి సూపర్ క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం శ్రీ లీల వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తుంది. అది కూడా హిట్టు పడ్డది అంటే అమ్మడు టాలీవుడ్ ని ఏలేయడం ఫిక్స్ అవ్వొచ్చు. ఇక ఈ లిస్ట్ లో సీతారామం మృణాల్ ఠాకూర్ కూడా ఉంది. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కాజేసింది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో సీరియల్స్ లో సత్తా చాటి అక్కడ నుంచి సినిమాలకు ప్రమోట్ అయినా సీతారామం ఇచ్చిన సక్సెస్ ఆమె కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. అదే ఇప్పుడు ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు తెచ్చేలా చేస్తుంది. ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ నాని 30వ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నట్టు టాక్.

సో ఈ లెక్కన చూస్తే రష్మిక, సమంత, పూజా హెగ్దే ప్లేస్ లో కొత్తగా శ్రీలీల, మృణాల్ ఠాకూర్ లు వచ్చేశారని చెప్పొచ్చు. ఉప్పెన భామ కృతి శెట్టి కూడా వరుసగా ఐదారు సినిమాలతో సందడి చేసినా అమ్మడు ఇప్పుడు దూకుడు తగ్గించినట్టు అనిపిస్తుంది. కృతి శెట్టికి నెక్స్ట్ హిట్ పడే వరకు ఆమెకు మరో ఛాన్స్ ఇవ్వడం కష్టమే అని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News