RRR విష‌యంలో అది కామెడీ అవుతోందా?

Update: 2022-10-08 06:38 GMT
వ‌చ్చే ఏడాది లాస్ ఏంజిల్స్ లోకి డాల్బీ థీయేట‌ర్ లో మార్చి 23న ఆస్కార్ అకాడ‌బమీ అవార్డుల వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జ‌ర‌గుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న ప‌లు ద‌శాల‌కు సంబంధించిన సినిమాలు విదేశీ చిత్రాల కేట‌గిరీలో ఆస్కార్ నామినేష‌న్స్ ని సాధించాయి. మ‌న ఇండియా త‌రుపున రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన 'RRR' ప‌లు కేట‌గిరీల్లో నామినేష‌న్స్ ని ద‌క్కించుకుంటుందని యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆశ‌గా ఎదురు చూశారు.

అయితే ఆ ఆశ‌ల్ని త‌ల‌కిందులు చేస్తూ గుజరాతీ మూవీ 'చెల్లో షో'ని ఇండియా త‌రుపున ఆస్కార్ బ‌రికి ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా స‌భ్యులు ఎంపిక చేయ‌డం ప‌లువుర‌ని షాక్ కు గురిచేసింది. 'RRR' ని ఎందుకు ప‌క్క‌న పెట్టారు. ఉత్త‌రాది సినిమా కాదు కాబ‌ట్టే 'RRR' ని ప‌క్క‌న పెట్టార‌ని, ఇద‌వి స‌రైన ప‌ద్ద‌తి కాదంటూ తెలుగు సినీ వ‌ర్గాలు ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా స‌భ్యుల తీరుపై మండ‌పడ్డాయి. తీవ్ర నిర‌స‌న‌ని వ్య‌క్తం చేశాయి కూడా.

అయితే  అనూహ్యంగా 'RRR'ని డ‌జ‌నుకు పైగా కేట‌గిరీల్లో నామినేట్ చేయ‌డం కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టడం అభిమానుల‌తో పాటు సినీ ప్రియుల్లోఆస‌క్తిని రేకెత్తిస్తోందిజ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇదిలా వుంటు ఓ విష‌యంలో మాత్రం 'RRR' కామెడీ అవుతుండ‌టం గ‌మ‌నార్హం. బెస్ట్ యాక్ట‌ర్స్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ మూవీ..ఇలా దాదాపు 12 విభాష‌ల్లో నామినేష‌న్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఇండులో ఒక్క‌టి ద‌క్కినా ఆనంద‌మేన‌ని ఫ్యాన్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.  

ఇదిలా వుంటే 'RRR' ఓ విష‌యంలో మాత్రం కామెడీ అవుతూ న‌వ్వులు పూయిస్తోంది. ఈ మూవీలో  అలియాభ‌ట్ చాలా త‌క్కువ నిడివి వున్న సీత పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ పాత్ర‌కు కూడా బెప్ట్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్ విభాగంలో ఆవార్డు వ‌స్తుంద‌ని నామినేష‌న్స్ లో ప్ర‌ధాన్య‌త‌నివ్వ‌మే ఇప్ప‌డు కామెడీగా మారింది. అలియా భ‌ట్ చేసింది చాలా చిన్న రోల్‌.. అందులో పెద్ద‌గా న‌టించ‌డానికి స్కోపే క‌నిపించ‌లేదు. అలాంటి పాత్ర‌ని బెస్ట్ స‌పోర్టింగ్ ఆర్టిస్ట్ కేట‌గిరీలో స్థానాన్ని క‌ల్పించాలని చూడ‌టం ఇప్ప‌డు నెట్టింట కామెడీగా మారింది.

దీనిపై నెటిజ‌న్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నార‌ట‌. అలియా భ‌ట్ మంచి న‌టే ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ యాక్టింగ్ కి స్కోప్ లేని పాత్ర‌లో త‌న‌ని నామినేష‌న్స్ లో నిల‌పాల‌నుకోవ‌డ‌మే కామెడీగా వుంద‌ని కామెంట్ లు వినిపిస్తున్నాయి. అలియా భ‌ట్ కంటే క‌నిపించింది కొంత స‌మ‌య‌మే అయినా భ‌ర్త, పిల్ల‌ల కోసం ప్రాణ త్యాగం చేసిన పాత్ర‌లో శ్రియ న‌ట‌న ఆక‌ట్టుకుంది.

అలియా క‌న్నా త‌న‌ని నామినేష‌న్స్ లో నిలిపి వుంటే బాగుండేద‌ని నెటిజ‌న్ ల వాద‌న‌. ఫెంటాస్టిక్ క్యారెక్ట‌ర్ల‌ని మాత్ర‌మే బెస్ట్ స‌పోర్టింగ్ కేట‌గిరీలో నిల‌పాల‌ని చూస్తుంటారు. మ‌రి 'RRR'టీమ్ ఏ ధైర్యంతో అలియాని క్యారెక్ట‌ర్ ని బెస్ట్ స‌పోర్టింగ్ కేట‌గిరీలో నామినేష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని నెటిజ‌న్ ల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుడు కూడా కామెంట్ లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News