మెగాస్టార్ హీరోగా ఆయన నూటా యాభై చిత్రాల కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి హైప్ లో సీజన్ లో చిరుతో పోటీ పడి సున్నం పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి మిగిలిన నిర్మాతలు అందుకు తగ్గట్టు తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. సౌత్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నార్త్ లో మాత్రం వార్ రూపంలో భారీ పోటీ స్వాగతం పలుకుతోంది.
ఇవాళ రిలీజైన ట్రైలర్ లో మైండ్ బ్లోయింగ్ అనిపించే తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం చూసి మూవీ లవర్స్ షాక్ తిన్నారు. ఇదీ సైరా వస్తున్న అక్టోబర్ 2నే లాక్ చేసుకుంది. సో హృతిక్ కు చిరుకి క్లాష్ తప్పదని తేలిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి పరస్పర ప్రభావం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉంటుందా అనే దాని గురించే మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇక్కడో విషయం మర్చిపోకూడదు. వార్ అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. అందులో ఎమోషన్స్ కానీ ఫ్యామిలీస్ ని అట్రాక్ట్ చేసే అంశాలు కానీ పెద్దగా ఉండవు. కాకపోతే మాస్ ని ఆకర్షించే ఫైట్లు మసాలాలు పుష్కలంగా ఉంటాయి. కానీ సైరా కేసు వేరు. ఇదో స్వాతంత్ర సమరయోధుడి నిజ గాథ. గూస్ బంప్స్ ఇచ్చే ఎలివేషన్లు దేశభక్తిని రగిలించే సన్నివేశాలు అన్నింటిని మించే చిరు మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ పెద్ద ప్లస్ గా నిలుస్తోంది.
సో సౌత్ వరకు సైరాకు వార్ పెద్ద థ్రెట్ కాకపోవచ్చు. కానీ నార్త్ లో మాత్రం కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. వార్ తెచ్చుకునే టాక్ ని బట్టి సైరా అక్కడ పెర్ఫార్మ్ చేయడం ఆధారపడి ఉంటుంది. ఇది ముందే ఊహించిన సైరా హిందీ నిర్మాతలు ఎక్సెల్ సంస్థ దానికి తగ్గట్టే ప్రణాళికలు సిద్ధం చేసి స్క్రీన్లను లాక్ చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. సో వార్ వల్ల సైరాకు వచ్చిన తీవ్రమైన ఇబ్బంది ఏమి లేదు కాబట్టి అభిమానులు మరీ ఆందోళన చెందాల్సిన పని లేదు.