మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' రిలీజ్ కి ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మరి బిజినెస్ పరంగా గాడ్ ఫాదర్ రేంజ్ ఎంతంటే? 150 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.
ఓవర్ సీస్ హక్కులు ఫారస్ ఫిలింస్ కు.. తెలుగు.. హిందీ ఓటీటీ రైట్స్ నెట్ ప్లిక్స్ కి.. హిందీ రిలీజ్ బాధ్యతలు..శాటిలైట్ హక్కులు అక్కడి పంపిణీదారుడికే అమ్మినట్లు తెలుస్తోంది. బ్యాలెన్స్ తెలుగు శాటిలైట్ మిగిలి ఉంది. తెలుగు రాష్ర్టాల్లో చిత్ర నిర్మాతలే ఓన్ రిలీజ్ చేయడంతో మొత్తంగా 150 కోట్ల కు పైగానే బిజినెస్ చేరుకుందన్నది ఓ అంచనా.
మరి అంతకు తక్కువగా ఉందా? అంతకు మించా? అన్నది సస్పెన్స్. ఇక సినిమాకి సంబంధించి ఇంకా ప్రచారం పనుల్ని యూనిట్ వేగవంతం చేయలేదు. ఆ మధ్య టీజర్ రిలీజ్ అయింది. టీజర్ పై డివైడ్ టాక్ వచ్చినా మెగా ఇమేజ్ తో కొట్టుకొచ్చేసారు. దీంతో ట్రైలర్ ఎలా ఉంటుంది? అన్న ఉత్సాహం మొదలైంది. ఈనెల 25న ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
అటుపై అభిమానుల మధ్య అనంతపురంలో ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అంతకు ముందే సల్మాన్ ఖాన్ ని యూనిట్ ఓ రేంజ్ లో ప్రచారం కోసం వినియోగించుకోవాలని చూస్తుంది. చిరంజీవి-సల్మాన్ తొలిసారి కలిసి నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తిగా రెట్టింపు అవుతుంది. వెండి తెరపై ఈ ద్వయం ఎలా ఉండబోతుంది అన్న ఎగ్జైట్ మెంట్ డే బై డే రెట్టింపు అవుతుంది.
కానీ అభిమానులకు ఓ రకమైన నిరాశ తప్పలేదు. ఇంత వరకూ మ్యూజికల్ గా సినిమాని శ్రోతల ముందుకు తీసుకెళ్లలేదు. కేవలం ఓ లిరికల్ సాంగ్ ని మాత్రమే రిలీజ్ చేసారు. ఆ పాటకి సంబంధించిన వీడియోని రేపు రి లీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆ పాట రిలీజ్ పై సల్మాన్ టెక్నికల్ రీజన్స్ వ్యక్తం చేయడంతో ఆపేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరెక్షన్ పనులు మొత్తం పూర్తి చేసి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. అటుపై వెంట వెంటనే మరో రెండు పాటలను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.