కొడాలి నానితో ఎన్టీఆర్ తెగదెంపులకు కారణం అదే

Update: 2022-11-08 12:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ -కొడాలి నానిలు ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రులు అన్నది  రహస్యం కాదు. ఎన్టీఆర్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'ఆది' సినిమా నిర్మాణంలో కొడాలి నాని కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి ఉన్నారు. కానీ రాజకీయాలు  ఇప్పుడు వారి సంబంధాలను తెంచాయి. అయితే ఎన్టీఆర్-కొడాలి నాని ఎందుకు విడిపోయారన్నది మాత్రం బయటకు రాలేదు.

ఇదే 'ఆది' మూవీ తీసిన దర్శకుడు వీవీ వినాయక్ తాజాగా ఈ విషయాలను వెల్లడించారు. అవి సంచలనమయ్యాయి.'జూనియర్ ఎన్టీఆర్ -కొడాలి నాని చాలా మంచి స్నేహితులు. ఒక్కసారిగా రాజకీయ కోణం రావడంతో విడిపోయారు. నాని వైఎస్‌ఆర్‌సీపీలో చేరడంతో ఒకరికొకరు సంబంధాలు తెగిపోయాయి. అప్పటి వరకు వారు అన్ని సమయాలలో కలిసి ఉన్నారు. పార్టీలు -కుటుంబాలు వారి మధ్య అంతరాన్ని పెంచాయి. నాని వైసీపీలో చేరిన రోజే ఎన్టీఆర్‌తో సంబంధాలు తెగిపోయాయని అనుకుంటున్నాను' అని వినాయక్ వెల్లడించారు.

ఎన్టీఆర్ చాలా కంపోజ్డ్ మనిషి అని, ఒక మనిషిని ఎలా ట్రీట్ చేయాలో ఎక్కడ హద్దులు పెట్టాలో తనకు బాగా తెలుసునని వినాయక్ అన్నారు. ప్రజలతో ఎలా వ్యవహరించాలో ఆయనకు సవివరమైన అవగాహన ఉంది అని వినాయక్ చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ - కొడాలి నాని -వినాయక్ కాంబినేషన్ లో భవిష్యత్తులో ఒక సినిమా చేసే అవకాశం ఉందని వినాయక్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దర్శకుడిగా సినిమాలు ప్రస్తుతం వినాయక్ తీయడం లేదు. ఫ్లాప్ లతో ఆయన కెరీర్ కు స్టాప్ పడింది. మరి  వినాయక్ భవిష్యత్తు ఏమిటో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Tags:    

Similar News