సిద్దూ జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ 'డీజే టిల్లు'. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ చిన్న సినిమాల్లో అనూహ్య విజయాన్ని సాధించిన ఔరా అనిపించింది. వసూళ్ల పరంగానూ భారీ సినిమాలకు థీటుగా కలెక్షన్ లని రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 30 కోట్లు రాబట్టి ఆశ్చర్య పరిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ని తెరపైకి తీసుకురావాలనుకున్నారు.
'టిల్లు 2' పేరుతో సీక్వెల్ ని సిద్దూ జొన్నలగడ్డ హీరోగా రీసెంట్ గా మొదలు పెట్టారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. హీరోయిన్ నేహా శెట్టితో పాటు ఈ సీక్వెల్ కు దర్శకుడు కూడా మారిపోయాడు. నేహాశెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ని అనుకున్నారు. దర్శకుడిగా మల్లిక్ రామ్ వచ్చిచేరాడు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందో లేదో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అనివార్య కారణాల వల్ల తప్పుకుందని ప్రచారం జరిగింది.
ఆ తరువాత ఆ ప్రచారం నిజమేనని తాను తప్పుకున్నానని ఇండైరెక్ట్ గా అనుపమ పరమేశ్వరన్ ప్రకటించింది. తన స్థానంలో 'ప్రేమమ్', 'శ్యామ్ సింగరాయ్' ఫేమ్ మడోన్నాసెబాస్టియన్ నటించనుందనే వార్తలు వినిపించాయి.
అయితే ఫైనల్ గా తను కూడా సిద్దూ జొన్నలగడ్డ పక్కన సెట్ కాదని తేలడంతో మళ్లీ టీమ్ అనుపమ పరమేశ్వరన్ నే సంప్రదించారట. ఈ ప్రాజెక్ట్ చేయాలని వచ్చిన ప్రతీ హీరోయిన్ బయటికి వెళ్లిపోతుండటంతో ఇప్పటికే 'టిల్లు2' నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఇలా హీరోయిన్ లు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్లిపోతుండటానికి కారణం సినిమాలో హీరో సిద్దూ జొన్నలగడ్డ కాంబినేషన్ లో ఇంటిమేట్ సీన్ లు ఎక్కువగా వుండటమేనని ఇన్ సైడ్ టాక్. ఆ సీన్ లు, లిప్ లాక్ లు చేయలేకే అనుపమ పరమేశ్వరన్ తో పాటు మరి కొంత మంది ఈ మూవీ నుంచి వెళ్లిపోయారట. అయితే ఈ ప్రాజెక్ట్ లోకి ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ తిరిగి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
పలు సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయిన అనుపమ పరమేశ్వరన్ తిరిగి మళ్లీ ఈ టీమ్ లో చేరడానికి ప్రధాన కారణం రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఈ మూవీ కోసం అనుపమ పరమేశ్వరన్ రూ. 1.75 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. అంత మొత్తం ఇవ్వడానికి రెడీ అయిపోవడం వల్లే అనుపమ పరమేశ్వరన్ మళ్లీ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చేసిందని ఇన్ సైడ్ టాక్. డిసెంబర్ 25 నుంచి అనుపమ పరమేశ్వరన్ 'టిల్లు 2' సెట్ లోకి ఎంటర్ కానుందట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.