రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. విజయ్ దేవరకొండ నటించనున్న 12వ ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరపైకి రాబోతోంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా యువీ ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో ఓ మూవీని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు.
దీనికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా ఎంచుకున్నారు. 'RRR' రిలీజ్ కు ముందే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. అయితే 'RRR' రిలీజ్ తరువాత చరణ్ క్రేజ్ పెరగడం.. పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ దక్కడం.. హీరోగా సమీకరణాలన్నీ మారిపోవడంతో.. తన రేంజ్ కి తగ్గ సినిమాలు మాత్రమే చేయాలని చరణ్ ఫిక్సయ్యాడట. ఆ కారణంగానే గౌతమ్ తిన్న నూరితో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని చరణ్ తిరస్కరించాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అదే ప్రాజెక్ట్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో గౌతమ్ తిన్ననూరి చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ తో అనుకుఎన్న ప్రాజెక్ట్ ని తను రిజెక్ట్ చేయడం వల్లే విజయ్ దేవరకొండతో చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఇది అసలు రీజన్ కాదని, బలమైన కారణం వుందని తెలుస్తోంది. 'RRR'లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా బ్రిటీష్ పాలకులకు అండగా నిలిచే పోలీస్ అధికారికగా కనిపించిన విషయం తెలిసిందే.
గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని చరణ్ రిజెక్ట్ చేయడానికి కారణం పోలీస్ క్యారెక్టరే నని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యంలో సాగే కథ కావడం..అందులో చరణ్ పాత్ర పోలీస్ పాత్ర కావడంతో మరోసారి పీరియాడిక్ ఫిల్మ్ లో మళ్లీ పోలీస్ పాత్రలో నటించడం ఇష్టం లేకే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని చరణ్ రిజెక్ట్ చేశాడని ఇన్ సైడ్ టాక్. తాజా వార్తల ప్రకారం విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న సినిమా పీరియాడిక్ ఫిల్మ్ అని తెలుస్తోంది.
ఇది తెలియని వారంతా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ల ప్రాజెక్ట్ ఫ్లస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరువాత చరణ్ మంచి ప్రాజెక్ట్ ని వదులుకున్నాడని, ఇంత మంచి సినిమాని చరణ్ ఎందుకు వదులుకున్నాడో అర్థం కాలేదని అంతా అనుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.