SSMB28 ని అందుకే సైలెంట్ గా స్టార్ట్ చేశారా?

Update: 2023-01-19 05:45 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ దాదాపు 12 ఏళ్ల విరామం త‌రువాత ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల విరామం త‌రువాత త్రివిక్ర‌మ్ - మ‌హేష్ ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో మ‌హేష్ అభిమానులు ఈ య ప్రాజెక్ట్‌ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు వారి ఎదురు చూపుల‌కు తెర‌దించుతూ ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ లో మొద‌లు పెట్టారు.

యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో రెగ్యుల‌ర్ షూటింగ్ ని మొద‌లు పెట్టి ఫ‌స్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. అయితే ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల అనంత‌రం ఆ యాక్ష‌న్ ఎపిసోడ్ ని ప‌క్క‌న పెట్టేశారట‌. ఆ త‌రువాత షూటింగ్ కి గ్యాప్ ఇచ్చేసిందిన చిత్ర బృందం ఫైన‌ల్ గా బుధ‌వారం రెగ్యుల‌ర్ షూటింట్ ని మొద‌లు పెట్టేశారు. అయితే లో ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తుండ‌ట‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నిర్మాణ సంస్థ‌పై జ‌రిగిన ఐటీ రైడ్స్ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ఇలా రెగ్యుల‌ర్ షూటింగ్ ని సైలెంట్ గా స్టార్ట్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో యాక్ష‌న్ ఘట్టాల చిత్రీక‌ర‌ణ కోసం `కేజీఎఫ్` ఫైట్ మాస్ట‌ర్స్ అన్బు అరివు వ‌ర్క్ చేశారు. అయితే మ‌హేష్ మాత్రం రామ్ ల‌క్ష్మ‌ణ్ కావాల‌న్నార‌ట‌. అయితే కొత్త‌గా షూట్ మొద‌లు పెట్ట‌డంతో యాక్ష‌న్ ఘ‌ట్టాల కోసం  రామ్ ల‌క్ష్మ‌ణ్ ల‌నే తీసుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ సార‌థీ స్టూడియోస్ లో జ‌రుగుతోంది.

ఇందులో బుధ‌వారం జ‌రిగిన షూటింగ్ లో మ‌హేష్ బాబు పాల్గొన్నార‌ట‌. ఇదిలా వుంటే వ‌చ్చే నెల నుంచి హీరో మ‌హేష్ బాబు, పూజా హెగ్డేల మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. పూజా హెగ్డే తో పాటు ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే షెడ్యూల్ లో శ్రీ‌లీల కూడా పాల్గొంటుంద‌ని తెలుస్తోంది. భారీ స్థాయిలో యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని త్రివిక్ర‌మ్ ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.  కానీ అభిమానులు మాత్రం ఆగ‌స్టులో కాకుండా ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని అభిమానులు బ‌లంగా కోరుకుంటున్నార‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News