టాలీవుడ్ లో బీజేపీ అన‌నూయలు?

Update: 2022-09-27 06:08 GMT
బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక సెల‌బ్రిటీల్ని టార్గెట్ చేస్తున్న వైనం క‌ళ్ల ముందు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ద‌క్షి ణాది రాష్ర్టాల్లో ప‌ట్టుకోసం సెల‌బ్రిటీల్ని పావులా వాడుకుంటుందా? అన్న సందేహాలు ఇప్ప‌టికే  తెర‌పైకి వ‌స్తున్నాయి. త‌రుచూ సెల‌బ్రిటీల్ని క‌ల‌వ‌డం..మాట మంతి చేయ‌డం...సినిమాలు బాగుంటే వాటి గురించి సోష‌ల్ మీడియా వేద‌క‌గా స్పందించ‌డం..అవ‌స‌ర‌మైతే నేరుగా భేటీ అవ్వ‌డం వంటి సంకేతాలు?  రాజ‌కీయ‌మా?  స్నేహ‌పూర్వ‌క‌మా? అన్న సందేహాల‌కు తావిస్తోంది.

గ‌తంలో ఏ ప్ర‌భుత్వం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకోలేదు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే ఇలాంటి స‌న్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా వేరు..రాజ‌కీయం వేరు అన్న చందంగానే స‌న్నివేశం క‌నిపించేంది. కానీ నేడు ప‌రిస్థితులు పూర్తి భిన్నంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ ఎస్  పార్టీని  గద్దె దించాలని తెలంగాణ బీజేపీ చాలా పట్టుదలతోనే క‌నిపిస్తుందని అంటున్నారు. సినిమా పరిశ్రమను ఆకర్షించడం బిజెపి వ్యూహాలలో ఒకటిగా క‌నిపిస్తుందంటున్నారు.

ఇటీవ‌లే బిజెపి అగ్ర నాయకులు జూనియర్ ఎన్టీఆర్.. నితిన్ వంటి వారిని కలిశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప‌డ్ డేట్ వైర‌ల్ అవుతోంది. నైజాంలో రూపొందుతున్న మూడు సినిమాలకు టి-బిజెపి మద్దతు ఇస్తోందని.. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ఆ పార్టీ భావిస్తోందని ప్ర‌చారం సాగుతోంది. 'ది కాశ్మీర్ ఫైల్స్' - 'కార్తికేయ 2' ఫేమ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా బిజెపి నాయకుడు. నిజాంలు .. వారి పాలన ఆధారంగా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దీనిపై అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ' ఈ అంశంపై ఒక బృందం పరిశోధన చేసి రెండేళ్లపాటు స్క్రిప్ట్‌పై పనిచేశామన్నారు. 'ది కాశ్మీర్ ఫైల్స్' టీమ్ ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తుంది.  ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం చివర్లో ప్రకటించే అవకాశం ఉందని రివీల్ చేసారు. ఇదే బాటలో మరో భాజపా నేత కూడా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమా కోసం తాను 30 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించానని.. అమిత్ షా సూచన మేరకు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సాగుతుందని ఆయన అన్నారు. బిజెపి నాయకుడు తన సినిమా కోసం ఫిల్మ్ ఛాంబర్‌లో మూడు టైటిల్స్ రిజిస్టర్ చేసారుట‌.  'రజాకార్'.. 'రజాకార్ ఫైల్స్' మరియు 'నిజాం డైరీస్' అనే మూడు టైటిల్స్ ఇప్ప‌టికే రిజిస్టర్ అయిన‌ట్లు స‌మాచారం.

అలాగే ప్రముఖ రచయిత మరియు రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కూడా ఓ క‌థ సిద్దం చేస్తున్న‌ట్లు తెలిపారు.  'పూర్వ హైదరాబాద్ రాష్ట్ర విముక్తి' మరియు ఇండియన్ యూనియన్‌లో విలీనమైన నేపథ్యంలో ఓ  స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన అంగీకరించారు. 'ముస్లింలు మరియు హిందువులు ఇద్దరూ భారతదేశంలో అంతర్భాగాలు అనే మానవతా సందేశాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. స్క్రిప్ట్ సిద్ధం కావడానికి కనీసం రెండు నెలలు పడుతుంది' అని విజయేంద్ర ప్రసాద్ ఓ స‌మావేశంలో అన్నారు. ఈ మూడు సినిమాలు డిసెంబర్ 2023 లోపు విడుదలయ్యే అవకాశం ఉందిట‌.  టిఆర్ఎస్ .. ఎంఐఎంలకు వ్యతిరేకంగా ఈ మూడు సినిమాలుంటాయ‌ని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News