తెలుగు విక్ర‌మ్ వేద రీమేక్ బాలీవుడ్ పై బేస్ అయిందా?

Update: 2022-09-29 01:30 GMT
కోలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'విక్ర‌మ్ వేద' బాలీవుడ్ లో రీమేక్ అవుతోన్న సంగ‌తి  తెలిసిందే. హృతిక్ రోష‌న్..సైఫ్ అలీఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుస్క‌ర్-గాయ‌త్రి ద్వ‌య‌మే హిందీలోనూ తెర‌కెక్కిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని సెప్టెంబ‌ర్ 30న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోంది. అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మంటూ ట్రేడ్ అంచ‌నా  వేస్తుంది.

సైప్..హృతిక్ లాంటి దిగ్గ‌జాల యాక్ష‌న్ పెర్పామెన్స్ కి ప్రేక్ష‌కులు ఫిదా అవ్వ‌డం ఖాయ‌మంటున్నారు. మ‌రి ఇలాంటి హిట్ సినిమా తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తులే ఉన్నాయి. త‌మిళ్ లో హిట్ అయిన చిత్రాన్ని మూడు నాలుగేళ్ల క్రిత‌మే తెలుగులో రీమేక్ చేయాల‌ని ప్ర‌యత్నించారు. ర‌వితేజ‌-నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని స‌న్నాహాలు చేసారు.

కానీ రెండు పాత్ర‌ల మ‌ధ్య వ్య‌త్యాస‌మే రీమేక్ కి అడ్డంకిగా మారింది. ఇద్ద‌రు హీరోల పాత్ర‌లు పోటా పోటీగా సాగ‌డ‌నికి ఏ ఒక్క‌రు అంగీకారం తెల‌ప‌క‌పోవ‌డంతో రీమేక్ కి బ్రేక్ ప‌డిన‌ట్లు గా అప్ప‌ట్లో మీడియా క‌థ‌నాలు వెడెక్కించాయి. ఇందులో పోలీస్ పాత్ర‌కి ర‌వితేజ త‌న‌కంటే త‌క్కువ స్టార్ డ‌మ్ ఉన్న హీరోని ఎంపిక చేయాల‌ని కండీష‌న్ పెట్టిన‌ట్లు దానికి మేక‌ర్స్ అంగీక‌రించ‌న‌ట్లు ప్ర‌చారం సాగింది. అలా చేస్తే సోల్ మిస్ అవుతుంద‌ని మేక‌ర్స్ వారించిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

అలాగే నాగార్జున సైతం పోలీస్ అధికారి పాత్రని చేయ‌డానికి అంగీక‌రించారు. కానీ  ఆ పాత్ర‌ మాతృక కంటే మ‌రింత శ‌క్తివంతంగా మార్చాల‌ని మేకర్స్ ని కోరారు. క‌థ‌లో ఇంకా కొన్ని ర‌కాల మార్పుల‌ను సూచించారుట‌. అటు ర‌వితేజ కండీష‌న్లు..ఇటు నాగార్జున డిమాండ్ల నేప‌థ్యంలో మేక‌ర్స్ సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో ప్రాజెక్ట్ ని పూర్తిగా ప‌క్క‌న‌బెట్టేసారు.

కానీ ఇప్పుడో మెగా హీరో ఇదే సినిమాని రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. హిందీ వెర్ష‌న్ చూసిన త‌ర్వాత స‌ద‌రు హీరో త‌న నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారని స‌మాచారం. క‌థ‌లో..పాత్ర‌ల ప‌రంగా ఓరిజ‌న‌ల్ కి.

రీమేక్ మ‌ధ్య తేడాలు గ‌మ‌నించ‌డానికి ఛాన్స్ ఉంది. సోల్ మిస్ అవ్వ‌కుండా ఎలాంటి మార్పులు చేసార‌న్న‌ది  హిందీ వెర్ష‌న్ లో తెలిసిపోతుంది.  సినిమా సక్సెస్ అయితే గ‌నుక తెలుగులోనూ ఆ చిత్రాన్ని రీమేక్ చేయ‌డానికి ఛాన్స్ ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News