క‌త్రినాకి మామ్ అయ్యే గ‌డియ‌లు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయా?

Update: 2022-11-20 01:30 GMT
ఏడాదంతా బాలీవుడ్ పెళ్లిళ్లు..పాపాయిల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన సంగ‌తి తెలిసిందే. విక్కీ కౌశ‌ల్-క‌త్రినా కైఫ్ వివాహం..అటుపై ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభట్ పెళ్లితో పాటు ఆ దంప‌తుల‌కు పండండి ఆడ‌బిడ్డ జ‌న్మించ‌డంతో క‌పూర్ కుటుంబంలో జోష్ మొద‌లైంది. ఏడాది ని సంతోషంగా ముగించ‌డానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ ముగింపులోనే మ‌రో కొత్త జోడీ త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోట్ అవ్వ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

క‌త్రినా ఇప్ప‌టికే గ‌ర్భం దాల్చినట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ విష‌యాన్ని అధికారిక‌గా ప్ర‌క‌టించ‌లేదు గానీ..కత్రినా ధ‌రిస్తోన్న దుస్తులు...బేబి బంప్ లుక్ ని క‌వ‌ర‌ప్ చేయ‌డం వంటి స‌న్నివేశాలు మీడియాలో ఆస‌క్తిక‌రంగా మారాయి. గ‌ర్భం దాల్చిన విష‌యాన్ని సీక్రెట్ గా ఉంచి పాపాయికి జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత అధికారికంగా విష‌యం చెప్పాల‌ని భావిస్తున్న‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

వీటికి తోడు క‌త్రినా కొన్నినెల‌లుగా బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సోష‌ల్ మీడియాలోనూ ఎలాంటి అప్డేట్ లేదు. వెకేష‌న్కి వెళ్లినా...పార్టీల‌కు వెళ్లినా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ ఉండేది. కొన్ని నెల‌లుగా అన్నిర‌కాల మీడియాల‌కు దూరంగా ఉండ‌టంతో క‌త్రినా గ‌ర్భం దాల్చింద‌నే బ‌ల‌మైన ప్ర‌చారం సాగుతోంది. తాజాగా క్యాట్ ప్ర‌స‌వించే స‌మ‌యం సైతం ద‌గ్గ‌ర ప‌డింద‌ని బాలీవుడ్ మీడియాలో కొత్త క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి.

నెల‌లు నిండ‌టంతో క‌త్రినా ఇంటికి   ఓ గైన‌కాలజిస్ట్ వ‌చ్చి వెళ్తున్నార‌ని...రెగ్యుల‌ర్ చెక‌ప్లో భాగంగా హాజ‌ర‌వుతున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.  ప్ర‌స్తుతం క‌త్రినా  కొత్త సినిమాలేవి క‌మిట్ అవ్వ‌డం లేదు. చేతిలో రెండు సినిమాలున్నాయి. `మేరీ క్రిస్మ‌స్`..`ప‌ఠాన్` చిత్రాల్లో న‌టిస్తోంది. వాటి షూటింగ్ కూడా పూర్తిచేసింది. ఈ నేప‌థ్యంలో క‌త్రినా   ప్ర‌స‌వం త‌ర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుని త‌దుప‌రి నిర్ణ‌యాన్నిప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.  

మ‌రోవైపు క‌త్రినా ఇంత వ‌ర‌కూ విష‌యం రివీల్  చేయ‌క‌పోవ‌డంతో కొత్త ర‌కం స‌దేహాలు మొద‌ల‌వుతున్నాయి. నిజంగా ఆమె గ‌ర్భం దాల్చి క‌నిపించ‌లేదా? వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో గుమ్మం దాట‌లేదా? అంటూ  సందేహిస్తున్నారు.  మ‌రి వీటికి క‌త్రినా ఎలాంటి బ‌ధులిస్తుందోచూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News