'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో.. ఇప్పుడు సౌత్ మేకర్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. దక్షిణాది హీరోలు కూడా ఇమేజ్ తో సంబంధం లేకుండా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ లో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న స్టార్ హీరోలంతా పాన్ ఇండియా స్టార్లుగా ఫీల్ అవుతున్నప్పటికీ.. అటు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఇటు సౌత్ ఇండియా సినీ ట్రేడ్ వర్గాలు మాత్రం కేవలం మూడు సౌత్ సినిమాలనే పాన్ ఇండియా సినిమాలుగా పరిగణిస్తారు. ఈ మూడు కూడా ఈ ఏడాది రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
అందులో ముందుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అలానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. 'బాహుబలి' 'సాహో' సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ చిత్రం కోసం నార్త్ ఆడియన్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక కన్నడ రాకింగ్ స్టార్ యష్ - దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'కేజీఎఫ్ చాప్టర్2' పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ఈ మూడు సినిమాలకి మాత్రమే నేషన్ వైడ్ గుర్తింపు మరియు క్రేజ్ దక్కింది.
ప్రస్తుతానికి అందరికంటే ముందు నుంచి 'ఆర్.ఆర్.ఆర్' మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రాజమౌళి తన మార్క్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటున్నాడు. టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి ఇద్దరు హీరోల ఇంట్రో వీడియోల వరకు అన్నీ సినిమాపై బజ్ ని క్రియేట్ అయ్యేలా చేశాడు. ఇక 'కేజీఎఫ్ 2' టీమ్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. తాజాగా విడుదలైన టీజర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. 'కేజీఎఫ్ 2' టీజర్ తో పోలిస్తే రాజమౌళి వదిలిన రెండు టీజర్లు దిగదుడుపే అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక రేసులో లాస్ట్ లో ఉన్న 'రాధేశ్యామ్' నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు వదిలిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నప్పటికీ మిగతా రెండు సినిమాల రేంజ్ లో లేవు. త్వరలోనే టీజర్ రాబోతోందని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు. మరి ఈ టీజర్ వచ్చిన తర్వాత 'రాధే శ్యామ్' ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.