బాల‌య్య‌...వీర‌య్య‌కి ప్ర‌భుత్వం ఆ ఛాన్స్ ఇస్తుందా?

Update: 2022-12-27 12:30 GMT
'వాల్తేరు వీర‌య్య‌'...'వీర‌సింహారెడ్డి' సంక్రాంతి కానుక‌గా ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రెండు రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 12 బాల‌య్య ప్రేక్ష‌కుల మందుకొస్తుంటే...13వ తారీఖున చిరంజీవి వీర‌య్య‌తో బ‌రిలోకి దిగుతున్నారు. ఈసారి రెండు సినిమాల మ‌ధ్య బాక్సాఫీస్ వ‌ద్ద గట్టి పోటీ ఉంటుంద‌ని తెలుస్తోంది. బాక్సాఫీస్ బ‌రిలో నిలిచిన  హీరోలిద్ద‌రు అభిమానుల మ‌ద్య కాక పుట్టించ‌డం ఖాయం.

మ‌రి ఈ రెండు సినిమాల‌కు టిక్కెట్ ధ‌ర‌లు పెంచే ప్లాన్ లో చిత్ర నిర్మాత‌లు క‌నిపిస్తున్నారా? ఆ దిశ‌గా ఇప్ప‌టికేప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల్ని నిర్మించింది మైత్రీ మూవీ మేక‌ర్స్.

కానీ టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులు బాటు వాళ్ల‌కు లేదు. నిర్మాత‌ల మండ‌లికి లేదు. ఏపీలో  ధ‌ర‌ల విష‌యం లో పెంచాలా? త‌గ్గించాలా? అని నిర్ణ‌యించేది ప్ర‌భుత్వం.

ఇప్ప‌టికే అక్క‌డ  ప్ర‌త్యేక జీవో అంటూ  ప్ర‌ణాళిక  ఒక‌టి సిద్ద‌మై ఉంది. ఆ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అంతా ప‌నిచేయాల్సి  ఉంది. రెండు  సినిమాల‌కు 5 షోల‌కు అనుమ‌తి తో పాటు ..టిక్కెట్ ధ‌ర‌లు పెంచాలి అన్న త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. టిక్కెట్ పై అద‌నంగా 50 రూపాయ‌లు పెంచాల‌న్న‌ది నిర్మాత‌ల ప్ర‌పోజ‌ల్ గా వెలుగులోకి వ‌స్తుంది.

అయితే తుదిగా నిర్ణ‌యం తీసుకోవాల్సింది మాత్రం ప్ర‌భుత్వమే. తెలంగాణ ప్ర‌భుత్వంతో ఇబ్బంది ఉండ‌క పొచ్చ‌ని తెలుస్తోంది. గ‌తంలో ప‌లు సినిమాల‌కు పెంచుకోవ‌చ్చు అని అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేసిన నేప‌థ్యంలో అక్క‌డ బెంగ అవ‌స‌రం లేదు. కానీ  ఏపీలోనే ఇబ్బందిక‌రంగా మారే అవకాశం ఉంద‌ని వినిపిస్తుంది. టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌డానికి ప్ర‌భుత్వం గ‌తంలో ఎలాంటి యాగీ చేసిందో తెలిసిందే.

చివ‌రికి పెంచిన త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు త‌లెత్తాయో కూడా వెలుగు లోకి వ‌చ్చింది. అయితే భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ప్ర‌భుత్వం ఇబ్బంది పెట్టే అవ‌కాశం లేదు. కానీ ఈ రెండు సినిమాలు భారీ బ‌డ్జెట్ చిత్రాలైతే కాదు. స్టార్ కాస్టింగ్ త‌ప్ప‌! నిర్మాణ వ్య‌యం మాత్రం 50..60 కోట్ల లోపే ఉంటుంది. మ‌రి ఈ రెండు సినిమాల విషయంలో ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News