స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరెక్కుతున్న `అల వైకుంఠపురములో` చిత్రీకరణ క్లైమాక్స్ చేరుకుంటోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచారం పీక్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఓ వర్గం నెగిటివ్ పబ్లిసిటీ రోజు రోజుకి అంతే స్పీడందుకుంటోంది. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన `ఇంటి గుట్టు` స్ఫూర్తిగా కథ రాసుకున్నారని.. `నేను శైలజ` సినిమాను పోలి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల విడుదలైన టీజర్ లో కొన్ని సీన్లు కాపీ అని ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.
అయినా ఈ తరహా ప్రచారం పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. దర్శకుడు త్రివిక్రమ్.. నిర్మాత అల్లు అరవింద్ మధ్య వివాదం తలెత్తిందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. సినిమా రన్ టైమ్ విషయంలో ఇద్దరి మధ్య సఖ్యత చెడిందని దాంతో వాగ్వాదం సాగిందని ప్రచారమవుతోంది. కథ డిమాండ్ మేరకు త్రివిక్రమ్ మూడు గంటల రన్ టైమ్ తో పాటు ఓ పాటను కూడా యాడ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. కానీ అందుకు అరవింద్ అడ్డు పడ్డారట.
మూడు గంటల సినిమా అంటే? థియేటర్ లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందోని సందేహం వ్యక్తం చేస్తూ వద్దని అరవింద్ కరాఖండీగా చెప్పేసారుట. అయినా త్రివిక్రమ్ అరవింద్ ను ఒప్పించే ప్రయత్నం చేసారు. కానీ అరవింద్ మాత్రం ససేమిరా అన్నారుట. చివరికి మాటల మాంత్రికుడే రాజీకి వచ్చి క్లైమాక్స్ పాటతో కలిపి 2.45 నిమిషాలకు లాక్ చేసినట్లు వినిపిస్తోంది. మరి ఈ కథనాల్లో వాస్తవం ఎంత? అన్నది దర్శక నిర్మాతలు క్లారిటీ ఇస్తే గాని తేలదు. అల.. చిత్రీకరణ పూర్తయ్యాక బన్ని.. సుకుమార్ మూవీ బిజీలో ఉన్న సంగతి తెలిసిందే.