'బాహుబలి' వంటి సంచలన సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు రాజమౌళి. ఈ మూవీతో ఇండియన్ సినిమాలో లార్జెర్ దెన్ లైఫ్ సినిమాలకు మరింత ఊతమిచ్చారు. రాజమౌళి అందించిన స్ఫూర్తితో ప్రస్తుతం తేశ వ్యాప్తంగా సినిమాల నిర్మాణ శైలి పూర్తిగా మారిపోయింది. దీంతో చాలా మంది లార్జర్ స్కేల్ లో పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టడం మొదలు పెట్టారు. 'బాహుబలి' సిరీస్ సినిమాల తరువాత S S రాజమౌళి 'RRR'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తోంది.
పలు అంతర్జాతీయ వేదికలపై రాజమౌళిని మరింత పాపులర్ చేస్తూ పలు అవార్డుల్ని దక్కించుకుంటోంది. రీసెంట్ గా రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ 2022 కు గానూ రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ అకాడమీ అవార్డుల్లోనూ 'RRR' నామినేట్ కావాలని రాజమౌళి విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఓ భారీ అడ్వెంచరస్ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఇండియానా జోన్స్' స్ఫూర్తితో జక్కన్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ని తెరపైకి తీసుకురానున్నారట. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ మూవీకి ప్రముఖ రచయిత, రాజమౌళి ఫాదర్ వి.విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ స్టోరీపై, ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఇలాంటి కథతో సినిమా చేయాలని రాజమౌళి కొంత కాలంగా ఎదురు చూస్తున్నాడని స్పష్టం చేశారు.
అంతే కాకుండా ఈ కథకు మహేష్ బాబు లాంటి నటుడు యాప్ట్ అని, అందుకే ఈ కథని తనతో చేయబోతున్నామన్నారు. మహేష్ ఇంటెన్సిటీ వున్న యాక్టర్. తను నటించిన సినిమాలు చూస్తే చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుందని, ఈ కథకు మహేష్ సరిగ్గా సరిపోతారని తనని ఎంచుకున్నామన్నారు. తనని దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశానన్నారు. అంతే కాకుండా ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా వున్న ఎన్నో ప్రదేశాల్లో షూట్ చేయాలనుకుంటున్నామని తెలిపారు.
ఇదే సందర్భంగా ఈ మూవీని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లబోయే టైమ్ ని చెప్పేశారు. 2023 జూన్ లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళుతున్నారట. పాన్ వరల్డ్ స్థాయిలో ఫారెస్ట్ అడ్వెంచర్‌గా ఈ మూవీని రాజమౌళి డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం రాజమౌళి భారీ స్థాయిలో హాలీవుడ్ మేకర్స్ ని రంగంలోకి దించే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.