RRR నిర్మాత‌కు ఐటీ ప్రాబ్లం రాబోతోందా?

Update: 2022-03-17 13:35 GMT
ప్ర‌పంచ సిల్వ‌ర్ స్క్రీన్‌పై స‌గ‌ర్వంగా ప్ర‌ద‌ర్శితం అయ్యేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న రాజ‌మౌళి.. సినీ సంచ‌ల‌నాల నుంచి దూసుకువ‌స్తున్న RRR మూవీపై అనేక బిగ్గెస్ట్ అంచ‌నాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమాను అన్నీ ఆచితూచి విడుద‌ల చేస్తున్నారు.

చివ‌ర‌కు సినిమా టికెట్ల విష‌యంపై ఎన్న‌డూ.. ఎవ‌రినీ క‌ల‌వ‌ని.. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి మ‌రీ విన్న‌వించారు. చిరంజీవితో ఒక‌సారి.. త‌ర్వాత‌..ప‌ర్స‌న‌ల్‌గా మ‌రోసారి.. ఆయ‌న వ‌చ్చారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల విష‌యంపైనా.. బెనిఫిట్ షోపై నా.. సానుకూల ప‌రిణామాలు సాధించారు.

ఏపీ ప్ర‌భుత్వం విధించిన ష‌ర‌తుల‌ను కూడా.. RRR  చిత్రానికి సంబంధించిన అన్ని వివ‌రాల‌ను.. సినిమా నిర్మాత‌లు అందించారు. అంటే.. బెనిఫిట్ షోల‌కు, టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించుకుని పెంచుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమతించాలంటే.. సినిమాకు సంబంధించి.. దర్శ‌కుడు, హీరోకు ఇచ్చిన రెమ్యున‌రేష న్ కాకుండా ఖ‌ర్చు చేసిన వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే RRR  బృందం అధికారికంగా.. ఆయా వివ‌రాల‌ను అందించింది. దీని ప్ర‌కారం.. సినిమాను రూ.336 కోట్లతో నిర్మించినట్లు దర్శక నిర్మాతలు ఏపీ ప్ర‌భుత్వానికి వివ‌రించారు..

అంటే.. అఫిషియ‌ల్‌గా.. ఒక సినిమాకు ఎంత ఖ‌ర్చు పెట్టార‌నే విష‌యాన్ని వారు వెల్ల‌డించారు. బ‌హుశ‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా నిర్మాత కూడా ఇలా వెల్ల‌డించి ఉండ‌రు. దీనికి కార‌ణం.. ఐటీ ప్రాబ్లం వ‌స్తుంద‌నే .. సినిమాను ఎంత  ఖ‌ర్చు చేసి నిర్మించినా.. దేని లెక్క‌లు దానికే ఉంటాయి .. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించేవా రు. కానీ, ఏపీ స‌ర్కారు విధించిన ష‌ర‌తుల‌తో ఇప్పుడు RRR  లెక్క‌ల‌ను అధికారికంగానే చెప్పాల్సి వ‌చ్చింది.  

సో.. మొత్తానికి ద‌ర్శ‌కుడు, హీరో.. రెమ్యున రేష‌న్ కాకుండా. 336 కోట్లు ఖ‌ర్చు అయినట్టు అధికారికంగా వెల్ల‌డైంది. ఈ నేప‌థ్యంలో 336 కోట్లు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయి..? అనే విష‌యంపై కేంద్ర ఆదాయ‌పు పన్ను అధికారులు RRR  నిర్మాత దాన‌య్య‌పై కొర‌డా ఝ‌ళిపించే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు ఆర్థిక నిపుణులు.

సినిమాకు పెట్టుబ‌డి దారులు ప‌న్నులు క‌ట్టారా? అనే విష‌యాన్ని సేక‌రించే అవ‌కాశం ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఐటీదాడులు ఏమైనా జ‌రిగే అవ‌కాశం ఉందా? అని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తు న చ‌ర్చ‌జ‌రుగుతోంది.  ఏదేమైనా.. ఇలాంటి ప‌రిణామాలు.. నిర్మాత‌ల‌కు ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.
Tags:    

Similar News