దక్షిణాది సినిమాల వరుస దాడితో బాలీవుడ్ విల విల లాడుతోంది. స్టార్స్ చేసిన హిందీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించకపోవడం.. అదే సమయంలో దక్షిణాది డబ్బింగ్ చిత్రాలకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గత ఏడాది ఎండింగ్ లో విడుదలైన 'పుష్ప' హిందీ బెల్ట్ లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి బాలీవుడ్ స్టార్స్ కి, మేకర్స్ కి నైట్ మేర్ గా మారింది. ఆ తరువాత బాలీవుడ్ కు బ్యాక్ టు బ్యాక్ ట్రిపుల్ ఆర్ , కేజీఎఫ్ కోలుకోలేని విధంగా చావు దెబ్బ కొట్టాయి.
ఈ పరిస్థితి నుంచి బాలీవుడ్ ఇక గట్టెక్కదా?.. సౌత్ సినిమాల ముందు చేతులెత్తేయాల్సిందేనా? అని బాలీవుడ్ వర్గాలు కవలరం చెందాయి. ఈ నేపథ్యంలో వారికి కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భూలాయా 2' భారీ ఊరటనిచ్చింది. బాలీవుడ్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. విడుదలైన తొలి రోజు ఈ మూవీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. 'భూల్ భూలాయా 2' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో బాలీవుడ్ దృష్టి ఇప్పుడు ఖిలాడీ మాస్టర్ అక్షయ్ కుమార్ నటించిన 'పృథ్వీరాజ్'పై పడింది.
తాజాగా ఈ మూవీ పేరుని 'సమ్రాట్ పృథ్వీరాజ్'గా మార్చేశారు. చంద్ర ప్రకాష్ దివ్వేది డైరెక్ట్ చేసిన ఈ మూవీని బాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ పై అంచనాలు భారీగానే వున్నాయి. అయితే చారిత్రక నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ సౌత్ సినిమాల థిటికి నిలబడుతుందా? అని ట్రేడ్ వర్గాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ నుంచి వస్తున్న 'మేజర్' ఈ మూవీకి ప్రధాన ముప్పుగా మారే అవకాశం వుందన్నది ట్రేడ్ వర్గాల మాట. యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరో ఇద్దరు ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మించిన 'మేజర్' సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ మూవీని 2008 ముంబై తాజ్ హోటల్ లో ఉగ్రమూకలు సృష్టించిన దానుణ మారణ కాండ కు ఎదురుగా నిలిచి వీరోచితంగా పోరాడి ప్రాణాలని వదిలిన రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని నిర్మించారు.
దేశ వ్యాప్తంగా దేశ భక్తి ప్రధాన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీగా నిలవబోతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లో ముందుగానే పేయిడ్ ప్రీమియర్స్ ని ప్రదర్శించారు.
వీటికి ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ అప్లాజ్ రావడంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఈ మూవీ 'పృథ్వీరాజ్'కి గట్టిపోటీని ఇవ్వడం ఖాయం అని చెబుతున్నారు. పది రోజుల ముందుగానే దేశ వ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్ లతో సందడి చేయడం మొదలు పెట్టిన 'మేజర్' అక్షయ్ కుమార్ తో పాటు బాలీవుడ్ కు నైట్ మేర్ గా మారి షాక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు. 'మేజర్'తో పోలిస్తే 'పృథ్వీరాజ్' కు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా పెద్దగా బజ్ లేదు. అంతే కాకుంగా ఈ మూవీపై ఎక్కడా హైప్ కనిపించడం లేదు. దీంతో ఈ సారి సౌత్ సినిమాతో బాలీవుడ్ కు బిగ్ షాక్ గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.