పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ ''వకీల్ సాబ్'' ట్రైలర్ విడుదలై వ్యూస్-లైక్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. 'పింక్' రీమేక్ గా తెరకెక్కిన ఈ కోర్టు డ్రామాలో పవన్ లాయర్ గా కనిపించి అలరించాడు. అయినప్పటికీ లాయర్ పాత్ర కాబట్టి పవన్ నుంచి ఆశించిన పవర్ ఫుల్ డైలాగ్స్ - హీరో ఎలివేషన్ సీన్స్ లేవని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే అభిమానులు ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కొత్తగా యాడ్ చేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.
'వకీల్ సాబ్' ట్రైలర్ ద్వారా ఇదొక మహిళా ప్రాధాన్యత సినిమా అని చెప్తూనే యాక్షన్ కూడా ఉంటుందని ఫైట్ సీన్స్ చూపించి హింట్ ఇచ్చారు. కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించిన ఒక్క సీన్ కూడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే 'వకీల్ సాబ్' ఫ్లాష్ బ్యాక్ లో లా కాలేజీ స్టూడెంట్ అయిన పవన్ హీరోయిన్ శృతిహాసన్ తో ప్రేమాయణం సాగిస్తూ ఉంటాడట. స్టూడెంట్ లీడర్ గా వ్యవహరించే పవన్.. పేదవారికి సాయం చేయడం.. ఆపదలో వున్నవారిని ఆదుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 'సత్యమేవ జయతే' వంటి హీరోయిజం ఎలివేట్ చేసే సాంగ్.. హీరోహీరోయిన్ల మధ్య 'కంటిపాపా' అనే సాంగ్ ఉండేలా డైరెక్టర్ చేసుకున్నాడని తెలుస్తోంది.
అలానే ప్రచార చిత్రాల్లో చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ధరించిన వాచీ కూడా హీరోయిన్ ఇచ్చే గిఫ్ట్ అయ్యుండొచ్చు. హీరోయిన్ కు దూరమయ్యాక ప్రాక్టీస్ కు కూడా దూరమవుతాడాని ట్రైలర్ చూపిస్తున్న పవన్ గడ్డం సీన్స్ ని చూస్తే అర్థం అవుతుంది. అయితే నిస్సహాయులైన ముగ్గురు అమ్మాయిలను కాపాడటానికి వకీల్ సాబ్ మళ్ళీ నల్ల కోటు ధరించి కోర్టులో అడుగుపెడతాడు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం 'పింక్' రీమేక్ కు జత చేసిన ఫ్లాష్ బ్యాక్ ఇదని తెలుస్తోంది.
ఇందులో నిజమెంతో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే. ఏదేమైనా పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని 'వకీల్ సాబ్' లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థం అవుతోంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు - ప్రొడ్యూసర్ దిల్ రాజు పవన్ ఫ్యాన్స్ కోసం మెయిన్ పాయింట్ పక్కదోవ పట్టకుండా కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా కథని రెడీ చేయించినట్లు కనిపిస్తోంది. మరి ఈ మార్పులు చేర్పులు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.