కాపీ క్యాట్ అంటారా.. మాయావి చెక్ పెట్టారుగా!

Update: 2020-01-11 07:19 GMT
సంక్రాంతి పోరులో `అల వైకుంఠ‌పుర‌ములో` స్ట్రాంగ్ కాంపిటీట‌ర్ అన్న చ‌ర్చ సాగుతోంది. శ‌నివారం (నేడు) స‌రిలేరు నీకెవ్వ‌రు రిలీజైంది. మ‌రుస‌టి రోజే అల వైకుంఠ‌పుర‌ములో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అల‌.. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తాజాగా మీడియా తో ఇంట‌రాక్ట్ అయ్యారు. అల వైకుంఠ‌పురములో చిత్ర క‌థ కాపీ అంటూ ప్ర‌చారం సాగ‌డంపైనా ఆయ‌న ఆటో రెస్పాండ్ అయ్యారు. మాట‌ల మాయావి త‌న‌దైన మార్క్ ఆన్స‌ర్ ఇచ్చారు.

అల‌.. క‌థాంశం పూర్తిగా ఫ్రెష్ స్టోరి. భార‌తంలో క‌ర్ణుడి త‌ర‌హా పాత్ర‌ను తెర‌పై చూపించాను. క‌ర్ణుడి జీవితంలోని షేడ్స్ ని బ‌న్ని పాత్ర‌కు ఆపాదించాను అని తెలిపారు. మ‌నం ఏ స్టోరీని తీసుకున్నా దానికి రామాయ‌ణం లేదా మ‌హాభార‌తం స్ఫూర్తిగా ఉంటుంది అని త‌న‌దైన శైలిలో చెప్పారు. అల వైకుంఠ‌పుర‌ములో ఫ్రెష్ స్టోరి. పాత సినిమాల‌కు కాపీ కానే కాదు! అంటూ ఖ‌రాకండిగా చెప్పారు.

దీంతో అల వైకుంఠ‌పుర‌ములో కాపీ క‌థాంశం అన్న ప్ర‌చారానికి మాయావి అలా చెక్ పెట్టేసిన‌ట్ట‌య్యింది. ఈ సినిమా ఎన్టీఆర్ న‌టించిన క్లాసిక్ మూవీ ఇంటి గుట్టుకి కాపీ అని .. లేదూ మ‌ల‌యాళం- మ‌రాఠాలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌క కాపీ అని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. ఈ శ‌నివారం మిడ్ నైట్ ప్రివ్యూల‌తో అల వైకుంఠ‌పుర‌ములో సీన్ ఎంత‌? అన్న‌ది తొలి రిపోర్ట్ రానుంది.
Tags:    

Similar News