త్రివిక్రమ్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా?

Update: 2019-12-24 01:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న విడుదల కానుంది. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.  ఇక సినిమా ఇంకా చివరిదశలోనే ఉంది.. షూటింగ్ పూర్తి కాలేదు. సెకండ్ హాఫ్ కు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ సాగుతోందట.  ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

అందులో మొదటిది.. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ కు అల్లు అరవింద్ గారు వస్తున్నారట.  దీంతో త్రివిక్రమ్ తనకు క్రియేటివ్ స్పేస్ దక్కడం లేదని కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట.  హారిక హాసిని బ్యానర్లో త్రివిక్రమ్ కు ఎప్పుడూ ఫ్రీ హ్యాండేనని అందరికీ తెలిసిందే.   త్రివిక్రమ్ ఏం చెప్తే అదే జరుగుతుంది.  అయితే ఈ సినిమా హారిక హాసిని బ్యానర్ తో కలిసి గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పైగా 'నాపేరు సూర్య' లాంటి ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ఇది. దీంతో అరవింద్ గారు షూటింగ్ ను కాస్త క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారట.  ఇది త్రివిక్రమ్ కు ఇబ్బందిగా మారుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదొక్కటే కాదట త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఎప్పుడూ కొంచెం లేటు అవుతుందనే సంగతి తెలిసిందే.   డిసెంబర్ చివరి వారంలోకి వస్తున్నా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో త్వరగా పూర్తి చేయాలని..  రిలీజ్ డేట్ ఎటువంటి పరిస్థితిలో మిస్ కాకూడదని నిర్మాతలు త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News