మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు 28వ ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన అతడు ఖలేజా రెండు సినిమాల కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో అయితే కలెక్షన్స్ అందుకోలేదు కానీ మహేష్ బాబును మాత్రం ఆ సినిమాలలో త్రివిక్రమ్ చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇక ఇప్పుడు మాత్రం పక్క ఊర మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టిన వారం రోజుల్లోనే ఫినిష్ చేశారు. ఇక ఈ వారంలో మరొక కీలక షెడ్యూల్ను మొదలు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కూడా త్రివిక్రమ్ అనుకుంటున్నాడు. అయితే ఒకవైపు మహేష్ బాబుతో షూటింగ్ చేస్తూనే మరొకవైపు త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలను కూడా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మహేష్ బాబు తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తోనే సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే చాలాసార్లు ఇండస్ట్రీలో కొన్ని కథనాలు వినబడ్డాయి. ఇక ఇప్పుడు కూడా మరొక టాక్ వినిపిస్తోంది.
దాదాపు అల్లు అర్జున్ ఫైనల్ కథను వినిపించినట్లుగా తెలుస్తోంది. బన్నీకే కథ నచ్చడంతో తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నాడట.
ఒక విధంగా పుష్ప సినిమా తర్వాత బన్నీ ఆలోచన మొత్తం కూడా పాన్ ఇండియా కథల పైనే ఉన్నాయి. అందుకే అంతకుముందే కొన్ని సినిమాలను ఓకే చేసినప్పటికీ కూడా వాటిని హోల్డ్ లో పెట్టాడు. ఇక త్రివిక్రమ్ తో కూడా ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా చేయాలి అని అనుకుంటున్నాడు.
కానీ ఇప్పటివరకు త్రివిక్రమ్ మాత్రం ఆ రూట్లో ఆలోచించలేదు. ఒక విధంగా బన్నీతో మంచి ర్యాపో ఉంది కాబట్టి త్రివిక్రమ్ కు పర్ఫెక్ట్ ఫ్యాన్ ఇండియా హీరో అని చెప్పవచ్చు. అన్ని అనుకున్నట్లు జరిగితే బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం మొదలు కావచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.