ఒకే రోజు రెండు సినిమాలు రిలీజైతే ఓపెనింగ్ వసూళ్లపై ఆ ప్రభావం తీవ్రంగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ ఉన్న సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. అదే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయితే అందుకు తగ్గట్టే కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. అందుకే ప్రతిసారీ మన నిర్మాతలు రిలీజ్ తేదీ విషయమై పక్కా ప్లానింగ్ తో సిద్ధమవుతున్నారు. రాజీకొచ్చి రిలీజ్ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా విక్రమ్.కె కుమార్ తెరకెక్కిస్తున్న `నానీస్ గ్యాంగ్ లీడర్` సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అదే రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న `వాల్మీకి` చిత్రాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకేరోజు రిలీజ్ విషయమై ప్రస్తుతం నిర్మాతలు పునరాలోచిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు నానీ కోసం వరుణ్ తేజ్ సినిమాని వారం పాటు వాయిదా వేశారని టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం... `వాల్మీకి` చిత్రాన్ని సెప్టెంబర్ 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఇటీవల టైటిల్ వివాదం నేపథ్యంలో ఇప్పటివరకూ రిలీజ్ తేదీ మార్పు విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన వాల్మీకి టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. అలాగే నానీస్ గ్యాంగ్ లీడర్ ప్రచార వీడియోలకు జనాల్లో స్పందన బావుంది. ఆ క్రమంలోనే ఈ రెండు సినిమాలపైనా అంచనాలు పెరిగాయి.