ప్రపంచంలోనే ఎదురేలేని ధనవంతుడి కుమార్తె పెళ్లి అంటే ఎలా ఉండాలి? 44 బిలియన్ డాలర్ల ఆస్తిమంతులైన అంబానీల ఇంట పెళ్లి వేడుక అంటే ఎలా ఉండాలి? ప‌్రత్యక్షంగానే చూపించారు ఇషా అంబానీ పెళ్లితో. ఈ పెళ్లి వేడుకలో కీలకమైన ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిసాయి. నేడు ఇషా అంబానీ మెడలో ఆనంద్ పిరమాళ్ మూడు ముళ్లు వేసే తరుణమాసన్నమైంది. ఇక ఈ వివాహమహోత్సవానికి అంబానీలు ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలిస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే.
సంగీత్ వేడుక కోసం ముంబై- బాంద్రా మొత్తం ఖాళీ చేయించిన ఘనత అంబానీలకే చెందుతుంది. సెలబ్రిటీల్ని గంపగుత్తగా ఉదయ్‌పూర్ కి తరలించిన మొనగాడు ముఖేష్ అంబానీ. కూతురి పెళ్లి వేడుకలో బాలీవుడ్ అగ్రకథానాయకులు సహా టాప్ స్టార్లంతా డ్యాన్సులాడి మోకరిల్లారంటే అదీ రాజుగారు అంబానీ సత్తా.
ఈ పెళ్లి వేడుకలో వరల్డ్ బెస్ట్ పాప్ సింగర్ బియాన్స్ ఆటా పాటతో ఉరకలెత్తించింది. కేవలం బియాన్స్ బృందం కోసమే 20 కోట్లు ఖర్చు చేసిన అంబానీ, పెళ్లి వేడుక కోసం వందల కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారు. ఇక ఇషా అంబానీ పెళ్లి కూతురు గెటప్ కోసమే 100కోట్లు పైగా ఖర్చు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇషా ధరించిన ఓ డ్రెస్ కోసం ఏకంగా 80కోట్లు ఖర్చు పెట్టారంటే కళ్లు భైర్లు కమ్మకుండా ఉంటాయా? 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తో శారీని, బ్లౌజును డిజైన్ చేయించేందుకు ఇంత ఖర్చు చేశారట. ఇదే తరహా డ్రెస్‌ని కోడలు శ్లోకా మెహతా కోసం వేరొకటి డిజైన్ చేయించారని తెలుస్తోంది. రాజుగారే తలుచుకుంటే దెబ్బలకు కొదవా?