ఫోటో స్టోరి: అంబానీ కూతురా మ‌జాకానా?

Update: 2019-09-06 15:33 GMT
బాలీవుడ్ స్టార్లతో అంబానీ ఫ్యామిలీ అనుబంధం గురించి తెలిసిందే. ఇటీవ‌లే రిల‌య‌న్స్ అధినేత‌ ముఖేష్ అంబానీ వార‌సుల పెళ్లి వేడుక‌ల్లో వ‌డ్డ‌న‌లు చేయ‌డంలో అమితాబ్-అమీర్ ఖాన్- షారూక్ అంత‌టివారే పోటీప‌డ్డారు. అలాంటిది ఆ ఫ్యామిలీ అమ్మాయి సెల‌బ్రిటీల ముందు ఎలా క‌నిపించాలి? అంటే ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఇషా అంబానీని చూడాలి.

ఇషా చ‌క్క‌ని అభిరుచి ఉన్న మోడ్ర‌న్ గాళ్ అని ఈ డిజైన‌ర్ లుక్ చెబుతోంది. స‌హ‌జంగానే  త‌న‌ సెల‌క్ష‌న్‌ అంద‌రికీ న‌చ్చుతుంది. టాప్ ట్రెండింగ్‌ స్టైలింగ్ ని అనుస‌రించ‌డం ఇషాకు నిత్య‌వ్యాప‌కం. స్టైల్స్ అండ్ ఫ్యాష‌న్‌ ప‌రంగా ఇప్ప‌టివ‌ర‌కూ ప‌బ్లిక్ వేదిక‌ల‌పైనా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తిసారీ క్రౌడ్ త‌న‌వైపు చూసేంత పెర్ఫెక్ట్ ఔట్ ఫిట్స్ ని ఎంపిక చేసుకుంటుంది. ఇటీవ‌లే త‌న‌ పెళ్లి వేడుక‌లో వ‌ధువు గెట‌ప్ స‌హా వేడుక ఆద్యంతం తాను ధ‌రించిన దుస్తుల సెల‌క్ష‌న్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆ డిజైన‌ర్ డ్రెస్ లు ఇత‌రులకు పిచ్చిగా న‌చ్చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న యువ‌తరం ఇషాని రోల్ మోడ‌ల్ గా భావించేంత‌టి సింప్లిసిటీ త‌న‌కే చెల్లింది.

తాజాగా ఇషా అంబానీ ఇన్ స్టాలో ఓ ఫోటోని షేర్ చేసంది. ఆ ఫోటోలో ఇషా ప్ర‌త్య‌క్ష‌మైన తీరుకు చూపరులు క‌ళ్లు తిప్పుకోలేదంటే అతిశ‌యోక్తి కాదు. హాఫ్ షోల్డ‌ర్ సిల్వ‌ర్ క‌ల‌ర్ బ్లౌజ్.. న‌ల్ల‌రంగు ప్లెయిన్ శారీని ధ‌రించింది. ఆ చీర‌కు బార్డర్ హెవీగా డిజైన్ చేసి ఉంది. ఇది త‌న‌కు మాత్ర‌మే కుదిరే అభిరుచి అని యూత్ తెగ పొగిడేస్తున్నారు. చీర‌లో ఇషా చాలా డిఫ‌రెంటుగా క‌నిపించింది. ల‌క్ష‌లాది మంది క‌ళ్లు ఈ ఫోటోపైనే వాలిపోతున్నాయి.  ఇండో-వెస్ట్రన్ స్టైల్స్ లోనే కాదు.. ఏ కోణంలో చూసినా సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. త‌న ముఖాకృతిని క‌వ‌ర్ చేసేలా హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఆక‌ట్టుకుంది. ఇషాకు ఆ సింపుల్ లుక్ ఎంతో బాగా సెట్ట‌య్యింది. దేశ‌వ్యాప్తంగా ఎంద‌రో అమ్మాయిలు ఈ ఫ్యాష‌న్స్ ని అనుస‌రించాల‌ని వేచి చూస్తారంటే అతిశ‌యోక్తి కాదు.


Tags:    

Similar News