ఓ వైపు హీరోయిన్ పాత్రలు చేస్తూ.. మరోవైపు టీనేజర్ కు అమ్మ పాత్రలో నటించేందుకు సహజంగా భామలు ముందుకు రారు. ఇలాంటి పాత్రల కోసం సీనియర్ భామలను తీసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం ఈ ట్రెండ్ మెల్లమెల్లగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అజయ్ దేవగన్ మూవీ దృశ్యంలో శ్రియ.. ఇలా టీనేజ్ అమ్మాయికి అమ్మగా కనిపించింది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీలో నిత్యా మీనన్ ఇలాంటి రోల్ చేయడం సెన్సేషన్ అయింది.
ఇప్పుడు ఓ 29 ఏళ్ల హీరోయిన్ అమ్మ పాత్రలను యాక్సెప్ట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. గుండె జారి గల్లంతయిందే చిత్రంలో నటించిన ఇషా తల్వార్.. ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. గతేడాది రాజా చెయ్యి వేస్తే చిత్రంలో కనిపించిన ఈ భామ.. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో యాక్ట్ చేస్తోంది. ఇప్పుడీ భామ ఓ మలయాళ మూవీకి కూడా సైన్ చేసింది. డెట్రాయిడ్ క్రాసింగ్ అనే పేరుపై ఈ చిత్రం రూపొందుతోండగా.. 'నాకు వైవిధ్యం అంటే ఇష్టం. రెబల్ మాదిరిగా ప్రవర్తించే ఏ టీనేజ్ కూతురికి అమ్మగా కనిపిస్తాను. యూఎస్ లో జరుగుతున్న షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అని ఇషా తల్వార్ చెబుతోంది.
నిర్మల్ సహదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. పృథ్వీరాజ్ తో నటించడం ఓ అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అని ఇషా తల్వార్ చెబుతోంది. 'నేను ఆయనతో చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. అవకాశం వచ్చింది.. ఒప్పుకున్నా అంతే' అని అంటోంది ఇషా.