మరాఠి బాషలో రేణు దేశాయ్ సొంత డైరక్షన్లో తీసిన సినిమా ''ఇష్క్ వాలా లవ్''. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఒక చిన్న పాత్రను చేశాడు. మరి ఇదే అకీరా డెబ్యూ సినిమా అనమాట. అయితే ఈ సినిమా మరాఠిలో రిలీజై రెండేళ్ళయినా కూడా.. ఎందుకో తెలుగులో మాత్రం చాలా లేటైంది. ఎట్టకేలకు సెప్టెంబర్ 4న డైరెక్టుగా ఈటివిలో ప్రసారమవుతోంది. మరి ఇందులో అకీరా పాత్ర ఎలా ఉండబోతోంది అనే ఆతృత అభిమానులకు ఉండటం సహజమే. అదే విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇస్తోంది రేణు. పెద్దగా ఊహించకండే అంటోంది.
''ఆ పాత్రను చేసినప్పుడు అకీరా వయస్సు 9 ఏళ్ళే. చిన్నతనంలో ఏదో సరదాగా ప్రయత్నించాడు. అయితే అకీరాను నేను డైరక్ట్ చేసినప్పుడు తనని ఒక పాత్రగాకంటే.. ఏదో నా కొడుకును డైరక్ట్ చేస్తున్నా అనే సెంటిమెంట్ నే ఎక్కువగా ఫీలయ్యాను. సో ఆ పాత్ర ద్వారా మీరు అకీరా గురించి ఎక్కువగా ఊహించుకోకండి. ఒక చిన్న పిల్లాడిని చూసినట్లే చూడండి'' అంటూ చెప్పింది రేణు దేశాయ్. అనవసరంగా అకీరా వెండితెరపై ఏదో చేసేశాడనే ఫీల్ కు గురూ.. ఆ తరువాత ధియేటర్లో మనోడు చేసింది నచ్చక ఫీలవుతారని ముందుగానే రేణు ఇలా సర్ది చెబుతున్నట్లుంది.
అయితే పవన్ అభిమానులు మాత్రం.. అకీరా తొలిసారిగా తెరపై కనిపిస్తున్నాడు కాబట్టి.. అది చిన్న పాత్రే అయినా.. ఒక నవ్వు నవ్వినా కూడా మేం ఆనందిస్తాం అంటున్నారు.