ఇస్మార్ట్ బ్యూటీ దీపావళి ప్లాన్స్‌ చాలా స్పెషల్‌

Update: 2021-11-04 08:30 GMT
అక్కినేని హీరోల సినిమాలు సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. ఆ రెండు సినిమాలు ఇవ్వలేని సక్సెస్‌ మరియు స్టార్‌ డమ్ ను ఇస్మార్ట్‌ శంకర్ సినిమా నిధి అగర్వాల్ కు తెచ్చి పెట్టింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే ఈ అమ్మడికి ఆఫర్లు వెళ్లువెత్తాయి. అయితే కరోనా వల్ల షూటింగ్ లు ఆగిపోయి ఈమెకు మరిన్ని ఆఫర్లు రాలేదు. లేదంటే ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో ఇస్మార్ట్‌ శంకర్ వల్ల అయిదు ఆరు సినిమాలకు మించి ఉండేవి. ఒక వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూ మరో వైపు ఇతర భాషల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు నేడు దీపావళి సందర్బంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో తన సంతోషాన్ని షేర్‌ చేసుకుంది.

ప్రతి సంవత్సరం కూడా దీపావళి అంటే తన కుటుంబంతో గడిపేందుకు బెంగళూరు వెళ్లి పోతుందట. షూటింగ్ తో ఎక్కడ ఉన్నా కూడా.. ఎంత బిజీగా ఉన్నా కూడా దీపావళి అంటే ఖచ్చితంగా బెంగళూరు వెళ్తానంటూ చెప్పుకొచ్చింది. కుటుంబ సభ్యులతో అక్కడ ఆడే ఆటలు.. చేసే పనులు ప్రతి సంవత్సరం కూడా ఎంజాయ్‌ చేస్తాను. ఖచ్చితంగా దీపావళికి కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొనడంతో పాటు ప్రతి ఏడాది కూడా ఇంటిని అలంకరించడంలో ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం నాకు ఇష్టం. ప్రతి దీపావళి మాదిరిగానే ఈ సారి కూడా చాలా గేమ్స్ ను మా ఫ్యామిలీ ప్లాన్‌ చేశారు. ఇక అమ్మ చేతి వంట తినడంతో పాటు అమ్మ ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రస్‌ ను వేసుకుని పండుగలో పాల్గొంటాను అంటూ మురిసి పోతూ చెప్పింది.

ఇక ఈ అమ్మడు మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా తో కలిసి నటించిన హీరో సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా తో ఈమెకు మరో సక్సెస్‌ దక్కుతుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది. ఇక నిధి అగర్వాల్‌ చేస్తున్న మరో బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ హరి హర వీరమల్లు. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా లో నిధి అగర్వాల్‌ యువ రాణి పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ ఖచ్చితంగా టాలీవుడ్‌ లో టాప్ స్టార్ గా మారిపోవడం ఖాయం అనే నమ్మకంతో అభిమాన వర్గాల వారు ఉన్నారు. నిధి అగర్వాల్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా మరి కొన్ని సినిమాల షూటింగ్ లకు కూడా హాజరు అయ్యేందుకు ఓకే చెప్పింది. త్వరలోనే ఆ సినిమాలు కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇటీవల ఒక సినిమా షూట్ లో ఉండగా బ్రేక్ తీసుకుని దీపావళి సెలబ్రేషన్ కు బెంగళూరు వెళ్లి పోయింది. రెండు రోజుల్లో మళ్లీ ఈ ముద్దుగుమ్మ షూట్ లో జాయిన్‌ అవ్వబోతుందట.
Tags:    

Similar News