బిగ్ అప్డేట్: RRR కోసం రెండు రిలీజ్ డేట్స్..!

Update: 2022-01-21 13:32 GMT
`ఆర్ ఆర్ ఆర్‌`.. ఈ మూవీ రిలీజ్ కోసం దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టారర్ మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. దాదాపు 14 భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భారీ స్థాయిలో జ‌న‌వ‌రి 7న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌ని ప్లాన్ చేశారు.

అయితే కోవిడ్‌, ఒమిక్రాన్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేయాల్సి వ‌చ్చింది. అయితే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయ‌బోతున్నార‌న్న‌ది గ‌త కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మార్చిలో విడుద‌ల‌వుతుందంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఓ డేట్ కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేలకు ఈ చిత్ర రిలీజ్ డేట్ ని మేక‌ర్స్ శుక్ర‌వారం ప్ర‌క‌టించి అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్‌ ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా పాండ‌మిక్ ప‌రిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటే `ఆర్ ఆర్ ఆర్‌` ని మార్చి 18న విడుద‌ల చేస్తామ‌ని అది కూడా పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ కి అనుమ‌తులు ఇస్తేనే ఆ డేట్ న విడుద‌ల చేస్తామ‌ని, లేదంటే ఏప్రిల్ 28న విడుద‌ల చేస్తామ‌ని `ఆర్ ఆర్ ఆర్` మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఊహించ‌ని వార్త `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ నుంచి బ‌య‌టికి రావ‌డంతో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు  గానూ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమ‌రం భీం గానూ క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. కీల‌క పాత్ర‌ల్లో బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్‌, హీరోయిన్ గా అలియా భ‌ట్ , హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ న‌టిస్తున్నారు. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో రే స్టీవెన్ స‌న్, అలీస‌న్ డూడీ, స‌ముద్ర‌ఖ‌ని క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News