రాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీవిష్ణు!
నేను ఆంధ్రాకి ఆడేవాడిని. రాయుడు హైదరాబాద్ టీమ్ కి అడేవాడు. అప్పట్లోనే అతడి బ్యాటింగ్ చూసి నెక్స్ట్ సచిన్ అని అంతా అనేవారు.
డాక్టర్లు కాబోయి యాక్టర్లు అయిన వాళ్లు ఎంతో మంది. మరి క్రికెటర్లు కాబోయి యాక్టర్లు అయింది ఎవరు? అంటే అందులో యంగ్ హీరో శ్రీ విష్ణు పేరు కూడా ఉంటుంది. అవును అతడు ముందు క్రికెటర్ అవ్వాల నుకున్నాడు? కానీ అది కుదరకపోవడంతో నటుడైనట్లు తెలిపాడు. ఈ సందర్భంగా అంబడి రాయుడితో గురించి కొన్ని ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు. `ఇద్దరు అండర్ 19 ప్లేయర్స్.
నేను ఆంధ్రాకి ఆడేవాడిని. రాయుడు హైదరాబాద్ టీమ్ కి అడేవాడు. అప్పట్లోనే అతడి బ్యాటింగ్ చూసి నెక్స్ట్ సచిన్ అని అంతా అనేవారు. ప్లేయర్స్ సహా అందరిలోనూ ఇదే టాపిక్ ఎక్కుగా నడిచేద` అన్నారు. ఆ తర్వాత రాయుడు ఐపీఎల్, ఇండియా టీమ్ లో ఎలాంటి ప్రదర్శన చేసాడో తెలిసిందే. ఇంకా మంచి భవిష్యత్ ఉండగానే రిటైర్మెంట్ ఇచ్చి అప్పట్లో సంచలనమయ్యాడు. అందుకు క్రికెట్ లో ఉన్న రాజకీయాలే కారణం అన్నట్లు గానూ రాయుడు హైలైట్ చేసాడు.
ఇక శ్రీవిష్ణు ఆ తర్వాత క్రికెట్ వదిలేసి చదువు పూర్తయిన అనంతరం సినిమాల్లోకి వచ్చేసాడు. రియల్ లైప్ లో క్రికెటర్ కాలేకపోయినా రీల్ లైప్ లో మాత్రం అయ్యాడు. `అప్పట్లో ఒకడుండేవాడు` అనే సినిమాలో క్రికెటర్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎమోషనల్ గా ఎంతగానో కనెక్ట్ అవుతుంది.
క్రికెటర్ గా ఎదగాలి అనుకునేవారి ఆశ ఎలా చిదిగి పోతుంది? అన్నది సినిమాలో ఎంతో ఎమోషనల్ గా చూపించారు. ప్రతీ క్రికెటర్ అభిమానికి కనెక్ట్ అయిన పాయింట్ ఇది. ఈసినిమా శ్రీ విష్ణు కెరీర్ లో ఇదో కల్ట్ క్లాసిక్ చిత్రంగా చెప్పొచ్చు.