చరణ్ కు ఇది అసలు పరీక్ష

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సోలోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’.

Update: 2024-10-01 11:28 GMT

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సోలోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మూడేళ్ళ క్రితం ప్రారంభమైంది. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది ఆఖరులో డిసెంబర్ 20న రిలీజ్ కి రెడీ అవుతోంది.

నిజానికి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనేసరికి ‘గేమ్ చేంజర్’ మీద ఆరంభంలో మంచి బజ్ ఉండేది. రాజమౌళి లాంటి దర్శకుడి తర్వాత ఆ స్థాయి ఇమేజ్ ఉన్న శంకర్ తో రామ్ చరణ్ సినిమా పడేసరికి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే శంకర్ ఓ వైపు ఈ సినిమా చేస్తూనే మధ్యలో వదిలేసిన ‘ఇండియన్ 2’ కూడా పట్టాలెక్కించాడు.

ఈ రెండింటిని ఒకేసారి బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో షూట్ చేయడం వలన చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. దీంతో ఈ మూవీ బడ్జెట్ కూడా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. నిజానికి 200 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని అనుకున్నాడు. అయితే మూవీ షూటింగ్ ఎక్కువ కాలం పట్టడం వలన బడ్జెట్ దాటిపోయిందనే మాట వినిపిస్తోంది.

దిల్ రాజుకి ఇప్పుడు గేమ్ చేంజర్ చాలా పెద్ద భారంగా ఉందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్ గా ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 75 డేస్ మాత్రమే ఉంది. అయితే బజ్ మాత్రం అస్సలు లేదు. ‘గేమ్ చేంజర్’ తో సాలిడ్ గా సౌండ్ క్రియేట్ చేసే అప్డేట్ ఒక్కటి పడలేదు. ఫస్ట్ సింగిల్, పోస్టర్స్ లాంటివి వచ్చిన ఫ్యాన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేయడం లేదనే మాట వినిపిస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ ‘గేమ్ చేంజర్’. అయితే ఈ సినిమా అతనికి చాలా భారం అవుతుందనే మాట ఇప్పుడు ప్రచారంలో ఉంది. సినిమాపై సరైన హైప్ లేదు. ఈ రెండు నెలల్లో ఏ మేరకు ఇంపాక్ట్ క్రియేట్ చేసి పబ్లిక్ అటెన్షన్ ని గ్రాబ్ చేస్తారో క్లారిటీ లేదు. సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది కానీ.. సాంగ్ సౌండ్ పెద్దగా క్రియేట్ అవ్వలేదు.

‘దేవర’ తో పోలిస్తే ‘గేమ్ చేంజర్’ పై చాలా తక్కువ పబ్లిక్ అటెన్షన్ ఉంది. ‘దేవర’ మూవీ సాంగ్స్ విషయంలో అనిరుద్ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చిన కూడా అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మూవీ రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందనలు వస్తోంది. అయితే మొదటి రోజే 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకుంది. దీనిని బట్టి మూవీ రిలీజ్ కి ముందు ఎంత హైప్ క్రియేట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ‘గేమ్ చేంజర్’ ‘దేవర’ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి. ‘గేమ్ చేంజర్’ పరీక్షని రామ్ చరణ్ ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News