ప్రభాస్.. ఒకే నెలలో 4 సినిమాలా.
టాలీవుడ్ లో నడుస్తోన్న రీరిలీజ్ ట్రెండ్ ని అనుసరిస్తూ చాలా మంది స్టార్ హీరోల పాత సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు.
టాలీవుడ్ లో నడుస్తోన్న రీరిలీజ్ ట్రెండ్ ని అనుసరిస్తూ చాలా మంది స్టార్ హీరోల పాత సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. 4K వెర్షన్ లో సిద్ధం చేసి పాత హిట్ మూవీస్ ని ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. హీరోల బర్త్ డేస్ సందర్భంగా చాలా సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మురారీ’ మూవీ రీ రిలీజ్ లో ఏకంగా 9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ మూవీ కూడా రీరిలీజ్ అయ్యింది. మొదటి, రెండు రోజులు ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాత హిట్ మూవీస్ అక్టోబర్ నెలలో వరుసగా రీరిలీజ్ కాబోతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రభాస్ సినిమాల హంగామా మొదలు కాబోతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ‘చక్రం’ మూవీ అక్టోబర్ 2న థియేటర్స్ లోకి రాబోతోందంట. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.
ఈ సినిమా ఫ్లాప్ అయిన కూడా ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఇష్టపడేవారికి చక్రం నచ్చుతుంది. అలాగే కృష్ణవంశీ ఈ సినిమాలో టచ్ చేసిన సోషల్ ఎలిమెంట్ కొంతమందికి కనెక్ట్ అయ్యింది. ‘చక్రం’ సినిమాలో జగమంతా కుటుంబం నాది సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాని రీరిలీజ్ లో ఎక్కువ మంది చూడటానికి ఆసక్తి చూపించొచ్చని మేకర్స్ భావిస్తున్నారు. దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సూపర్ హిట్ మూవీగా నిలిచింది.
ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉంటాడు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 22న ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. అలాగే కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ‘డార్లింగ్’ మూవీ అక్టోబర్ 23న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు ప్రభాస్ డెబ్యూ మూవీ ‘ఈశ్వర్’ కూడా అదే రోజు థియేటర్స్ లోకి రాబోతోంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ మూవీ తెరకెక్కింది.
ఇలా అక్టోబర్ నెలలో మొత్తం ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ కూడా 4K క్వాలిటీతో ఈ సినిమాలని థియేటర్స్ లో మళ్ళీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీటిలో ఎన్ని ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ని రాబడతాయనేది వేచి చూడాలి.