మొన్ననే సాంబార్ ల్యాండ్ కు షేకిచ్చిన ఐటి అధికారులు.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా దాడుల పర్వాన్ని స్టార్టు చేశారు. రేపు రిలీజ్ అవుతున్న బ్రూస్ లీ ని ఇప్పుడు టార్టెట్ చేశారు. ఆదాయపు పన్నుశాఖ గురువారం దర్శకుడు శ్రీను వైట్ల - నిర్మాత డీవీవీ దానయ్య - సంగీత దర్శకుడు థమన్ - ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసాలపై దాడులు మొదలెట్టారు.
రామ్ చరణ్ హీరోగా రూ. 50 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన బ్రూస్ లీ చిత్రం రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బిజినెస్ దాదాపు 60 కోట్లు అని వార్తలు రావడంతో.. ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ దాడులు చేయడానికి సన్నద్దమైందని ఒక వార్త ఉదయాన్నే వచ్చింది. అందుకు తగ్గట్లే.. గురువారం మధ్యాహ్నం ఐటి గ్యాంగ్ సడన్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీనువైట్ల - దానయ్య నివాసాలతో పాటు, వారి కార్యాలయాలు, వారి రెలెటివ్స్ ఇళ్లలోనూ సెర్చింగ్ చేపట్టారు.
ఇకపోతే మొన్ననే తమిళంలో ఇలాగే పులి సినిమా టీమ్ పై ఐటి దాడులు జరగ్గా.. సినిమా రిలీజ్ ఏకంగా ఓ రెండు రోజులు పోస్టుపోన్ అయిపోయింది. మరి బ్రూస్ లీ పరిస్థితి ఏంటో..??