మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న రంగస్థలం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద ఐటి దాడులు జరిగాయన్న వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమనే నిర్ధారించే ఆధారాలు ఏవి లేనప్పటికీ ఈ వేసవిలో వస్తున్న క్రేజీ సినిమాల్లో ఇదే మొదటి ప్లేస్ లో ఉంది కాబట్టి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ఇది దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు కనక ఇది నిజమని చెప్పలేం కాని టాక్ మాత్రం జోరుగా నడుస్తోంది. ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకున్న రంగస్థలంకు ఈ మూడు రోజులు కీలక దశ కనక వ్యాపార లావాదేవీలు విస్తృతంగా ఉంటాయి. ఈ నేపధ్యంలోనే ఇవి జరిగినట్టు తెలుస్తోంది. రంగస్థలంతో పాటు మైత్రి సంస్థ నాగ చైతన్య తో సవ్యసాచి కూడా నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన దస్త్రాలు కూడా పరిశీలించినట్టు సమాచారం. కొన్ని కీలకమైన ఫైల్స్ జప్తు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇది ఇప్పుడు సినిమా వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనికి సంబంధించి నిర్ధారణ చేయాల్సి ఉంది. భారీ హైప్ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు దీని మీద భారీ పెట్టుబడులు పెట్టిన నేపధ్యంలో ఊహకు అందని స్థాయిలో బిజినెస్ జరిగినట్టు గతంలోనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ దాడులు జరగడానికి కూడా ఇదే కారణం కావొచ్చని కామెంట్స్ వస్తున్నాయి. డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో సరైన వివరాలతో లేకపోవడం వల్ల ఐటి శాఖ అధికారులు కాస్త గట్టిగానే నిలదీసినట్టు సమాచారం. ఇది నిర్ధారణ కావాలంటే మైత్రి నుంచి అప్ డేట్ రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు తప్ప ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు ఊపందుకున్న తరుణంలో ఈ ఐటి దాడుల విషయం షాక్ కలిగించేదే. మరి నిజమో కాదో తెలియాలంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే నోట్ కోసం వేచి చూడాలి.