రూమర్: ఇద్దరు పెద్ద హీరోలపై ఎటాక్?

Update: 2016-11-22 11:30 GMT
ఇప్పుడు ఇన్ కం ట్యాక్స్ దాడులు కూడా ఎవ్వరూ ఊహించని స్టయిల్లో జరుగుతున్నాయి. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు టాప్ హీరోలపై ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిందని ఒక టాక్ వస్తోంది. ఇద్దరూ కూడా రాజకీయంగా భారీ కనక్షన్లు ఉన్నవారే కాని.. ఐటి శాఖ వారు సడన్ గా పొద్దుపొద్దున్నే దాడి చేస్తారని అస్సలు ఊహించలేదట.

వివరాల్లోకి వెళితే.. జూబ్లీ హిల్స్ లో ఉన్న వీరి ప్యాలెస్ వంటి ఇళ్ళపై ఒక్కసారిగా ఐటి టీమ్ ఒకటి దాడి చేసింది. అసలు వీరు చేస్తున్న బిజినెస్ లు.. పెట్టుబడులు.. ఉన్నపలంగా వీరికి సంబంధించిన బ్యాంక్ ఎకౌంట్లలో ఉన్న డబ్బులు.. లావాదేవీల వివరాలు.. వగైరా వగైరా మొత్తంగా కూపీ లాగేశారట ఆ దాడుల్లో. అంతేకాదు.. వీరి దగ్గర పెద్దగా పాత నోట్లతో కూడిన క్యాష్‌ ఏదీ లేకపోయినా కూడా.. భారీ పేమెంట్లు అందుకునే వీరు.. వారి పేమంట్లకు తగిన బ్యాంక్ ఎకౌంట్ స్టేట్ మెంట్లను చూపించాల్సి వచ్చిందట. అవన్నీ తీసుకుని సీజ్ చేసిన అధికారులు.. త్వరలోనే వీళ్లను ఎక్సప్లనేషన్ ఇవ్వమని చెప్పారట.

అయితే ఈ ఇద్దరి హీరోలపై ఊహించని రీతిలో ఎందుకు ఎటాక్ జరిగిందంటే.. వీరు ఇతరత్రా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం.. పెద్ద మొత్తంలో బిజినెస్ చేయడమే అందుకు కారణం అని తెలుస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News