ఇంకా టైముంది బాస్.. అప్పుడే సంక్రాంతి సైర‌నా?

Update: 2022-05-01 03:30 GMT
క‌రోనా.. ఒమిక్రాన్ ల కార‌ణంగా ఈ ఏడాది సంక్రాంతి సంద‌డి పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కేవ‌లం అక్కినేని హీరోలు మాత్ర‌మే ఈ సంక్రాతిని ఆక్ర‌మించి సంద‌డి చేశారు. మిగ‌తా హీరోలంతా థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. కార‌ణం భారీ చిత్రాలు.. ఎక్కువ థియేట‌ర్ల‌లో వంద శాతం ఆక్యుపెన్సీ లేక‌పోవ‌డం.. క‌రోనా, ఒమిక్రాన్ ల భ‌యంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అనే అనుమానాలు మ‌రో వైపు, దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల వంద శాతం ఆక్యుపెన్నీలోకి రాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో భారీ చిత్రాలు సంక్రాంతి బ‌రిలో దిగ‌డానికి ఆస‌క్తిని చూపించ‌లేదు.

దీంతో ఈ ఏడాది సంక్రాంతి స‌మ‌రం చ‌ప్ప‌గా సాగింది. పెద్ద‌గా పోటీ లేక‌పోవ‌డం.. భారీ చిత్రాల రిలీజ్ లు లేక‌పోవ‌డంతో పెద్ద‌గా సంద‌డి క‌నిపించ‌లేదు. సంక్రాంతికి రాధేశ్యామ్‌, ట్రిపుల్ ఆర్ వంటి భారీ పాన్ ఇండియా మూవీస్ వారం వ్య‌వ‌ధిలో 2022 సంక్రాంతికి పోటీప‌డాల‌ని డేట్ లు ఫిక్స్ చేసుకున్నా త‌రువాత ప‌రిస్థితులు మార‌డంతో రిలీజ్ ల‌ని ర‌ద్దుచేసుకున్నారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు సైలెంట్ గా వున్న `బంగార్రాజు` సోలోగా బ‌రిలోకి దిగేశాడు. పోటీకి మ‌రే సినిమా లేక‌పోవ‌డంతో తాజా ప‌రిస్థితి `బంగార్రాజు`కు అడ్వాంటేజీగా మారింది.

దీంతో 2022 సంక్రాంతిని సోలోగానే అక్కినేని హీరోలు కింగ్ నాగార్జున‌, నాగ‌చైత‌న్య `బంగార్రాజు`తో సెల‌బ్రేట్ చేసుకున్నారు. అయితే 2023 మాత్రం అలా సోలోగా వుండ‌ద‌ని, పోటీపోటీగా భారీ సినిమాలు రాబోతున్నాయ‌ట‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్  ఈ సంక్రాంతికి శంక‌ర్ సినిమాతో బ‌రిలోకి దిగాల‌ని ఉవ్వ‌ళ్లూరుతున్నార‌ట‌. అయితే శంక‌ర్ మాత్రం షూటింగ్ ఆల‌స్యం చేస్తుండ‌టంతో చ‌ర‌ణ్ సంక్రాంతి రేస్ పై ఆశ‌లు వ‌దులు కోవాల్సిందే అంటున్నారు.

బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `విన‌య విధేయ రామ‌`. ఈ చిత్రంతో 2019లో సంక్రాంతి బ‌రిలో నిలిచిన రామ్ చ‌ర‌ణ్ కు ఈ సినిమా తీవ్ర నిరాశ‌ను క‌లిగించింది. దీంతో 2023 సంక్రాంతి రేసులో నిల‌వాల‌ని గ‌ట్టిగానే అనుకున్నా అది శంక‌ర్ వ‌ల్ల కుద‌ర‌డం లేదు. అయితే చ‌ర‌ణ్ రానంటే చిరు వ‌స్తానంటూ రెడీ అవుతున్నాడ‌ట‌. మెగాస్టార్ ప్ర‌స్తుతం బాబీ డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో సంక్రాంతి బ‌రిలో దిగాల‌ని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.    

ఇక ఇదే రేసులో వంశీ పైడిపల్లి త‌ను విజ‌య్ తో చేస్తున్న బై లింగ్వ‌ల్ మూవీతో రంగంలో దిగ‌బోతున్నాడ‌ట‌. ఇటీవ‌లే షూటింగ్ ప్రారంభ‌మైన ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో దింపాల‌ని వంశీ పైడిప‌ల్లి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ‌ర్క్ చేస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక 2022 సంక్రాంతికి `స‌ర్కారు వారి పాట‌`తో సంద‌డి చేయాల‌నుకున్న మ‌హేష్ ప‌రిస్థితుల కార‌ణంగా అది కుద‌ర‌క‌పోవ‌డంతో 2023 సంక్రాంతికి త్రివిక్ర‌మ్‌ మూవీతో రావాల‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీ `స‌ర్కారు వారి పాట‌` రిలీజ్ త‌రువాత సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలిసింది. అక్టోబ‌ర్ వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి సినిమాని సిద్ధం చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. ఇదిలా వుంటే ఆగ‌స్టు లో `లైగ‌ర్`తో రాబోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌లే రెండు చిత్రాల‌ని బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ చేసేశారు. ఇందులో పూరితో `జెజిఎమ్‌`(జ‌న‌గ‌ణ‌మ‌న‌), శివ నిర్వాణ‌లో రొమాంటిక్ ల‌వ్ స్టోరీ ని ప్రారంభించాడు. ఇందులో శివ నిర్వాణ‌తో చేస్తున్న ల‌వ్‌స్టోరీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

ఇలా స్టార్ హీరోలంతా సంక్రాంతి బ‌రికి సై అంటే సై అంటూ అప్ప‌డే సైర‌న్ మోగించేస్తుంటే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మాత్రం ఏకంగా బెర్త్ నే క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నాడు. ఆయ‌న న‌టించిన `ఆదిపురుస్ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి జ‌న‌వ‌రి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టించిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే వున్నాయి.
Tags:    

Similar News