మా పాప త్వ‌ర‌లో వ‌స్తుందని ఆలియా మురిపెం

Update: 2022-10-18 04:22 GMT
బాలీవుడ్ అందాల నాయిక ఆలియా భట్ తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో నటుడు రణబీర్ కపూర్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ఏడాది జూన్ లో తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది. బ్ర‌హ్మాస్త్ర మొద‌టి భాగం విజ‌యం సాధించ‌డంతో అదే ఆనందంలో ఇప్పుడు మ‌రో శుభవార్త‌ను కూడా చెప్పింది ఈ జంట‌.

ఆలియా రిల‌య‌న్స్ ఆస్ప‌త్రిలో ప్ర‌స‌వించేందుకు ఏర్పాట్లు సాగాయి. ర‌ణ‌బీర్ - ఆలియా ఇంటికి ఒక కొత్త అతిథి చేరేందుకు ఇంకెంతో స‌మ‌యం లేదు. నిజానికి నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఏ క్ష‌ణ‌మైనా బిడ్డకు జన్మనిచ్చే అవ‌కాశం ఉంద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. కానీ అక్టోబ‌ర్ మిడ్ లోనే అంటే రెండు నెల‌లు ముందుగానే ఆలియా ఆస్ప‌త్రిలో టెస్టులు చేయించుకుంది. గుర్గావ్ లోని H.N. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో ఆలియా భట్ పేరు నమోదు చేసినట్లు కపూర్ కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.

ఆస్ప‌త్రి నుంచి ఫోటో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. "మా పాప... త్వరలో వస్తుంది..." అని ఆలియా క్యాప్ష‌న్ లో రాసింది. ఆమె తన సోనోగ్రఫీ పరీక్షలో ఉన్న ఆసుపత్రి నుండి ఒక ఫోటోని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. రణబీర్ కపూర్ తన మంచం పక్కనే లాల‌న‌గా త‌న భార్య చెంత‌నే క‌నిపించాడు.

2018లో బ్రహ్మాస్త్రా సెట్స్‌లో కలుసుకున్న తర్వాత అలియా భట్ - రణబీర్ కపూర్ ప్రేమలో పడ్డారు. ఇంత‌లోనే ప్రేమ ఫ‌లించి ఇరువైపులా పెద్ద‌ల అంగీకారంతో పెళ్ల‌యింది. వెంట‌నే త‌మ జీవితాల్లోకి మ‌రో కొత్త ఆనందానికి ఆహ్వానం ప‌లికేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కొన్ని రోజుల్లోనే శుభవార్త అంద‌నుంది.

ఆలియా భ‌ట్ కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  గంగూబాయి కతియావాడి- డార్లింగ్స్- బ్రహ్మాస్త్ర వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాల తర్వాత అలియా హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర నాయిక‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో త‌న జీవితంలోకి వ‌రుస‌గా ఆనంద క్ష‌ణాలు వెల్లువ‌లా వెంట వ‌స్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News